ప్రస్తుతం తమిళనాట ఎన్నికల హడావిడి ఓ రేంజ్ లో ఉంది. మీడియా మొత్తం కూడా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయంపై చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూ బిజీగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీడియా ఎటెన్షన్ మొత్తం తనవైపు తిప్పేసుకున్నాడు హీరో విజయ్. ఒకే ఒక్క సైకిల్ రైడ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. తన ఇంటి దగ్గర నుండి పోలింగ్ బూత్ వరకు సైకిల్ పై వచ్చిన విజయ్.. తమిళనాడు ఓటర్లకు కొత్త రకమైన సంకేతాలు ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు దేశమంతటా వైరల్ అయ్యాయి.
పెట్రోల్ ధరలు పెరిగిన దానికి నిరసనగా.. విజయ్ ఇలా సైకిల్ పై వచ్చాడని అందరూ ఫిక్స్ అయిపోయారు. మోడీపై నిరసనగా విజయ్ ఇలా చేశాడని అనుకున్నారు. ఈ విషయంలో మోడీ వ్యతిరేకులు విజయ్ ని సపోర్ట్ చేస్తుండగా.. బీజేపీ కార్యకర్తలు మాత్రం ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని.. రోజూ షూటింగ్ కి ఇలా సైకిల్ మీద వెళ్లగలరా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. హాట్ టాపిక్ గా మారిన ఈ విషయంపై విజయ్ స్పోక్స్ పర్సన్ స్పందించారు.
విజయ్ ఇంటికి, పోలింగ్ బూత్ కి మధ్య ఎంతో దూరం లేదని.. ఆ కారణంగానే సైకిల్ మీద వచ్చాడని అన్నారు. పైగా.. ఆ మార్గంలో అన్నీ ఇరుకు రోడ్లేనని.. కారులో వస్తే పార్కింగ్ చేయడానికి సైతం స్థలం లేదని.. అందుకే విజయ్ సైకిల్ మీద రావాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. విజయ్ సైకిల్ రైడ్ గురించి జనాలు ఏదేదో ఊహించుకుంటుంటే ఇలా పార్కింగ్ లేక సైకిల్ మీద వచ్చారని చెప్పడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది.
Most Recommended Video
వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!