Vishwak Sen: ఇండియాలో బెస్ట్ యాక్టర్ ఎన్టీఆర్ .. విశ్వక్ కామెంట్స్ వైరల్!

దాస్ కా ధమ్కీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ ఎన్టీఆర్ గొప్పదనం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నేను మాట్లాడే సమయంలో మా ఎన్టీఆర్ అన్నను డిస్టర్బ్ చేయవద్దని ఆయన తెలిపారు. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్ వాయిస్ అని విశ్వక్ సేన్ పేర్కొన్నారు. అభిమానికి ఇచ్చిన మాట కోసం తారక్ ఇక్కడికి వచ్చారని ఆయన తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి పిలిచి తమ్ముడికి భోజనం పెట్టినట్టు నాకు భోజనం పెట్టాడని కారు వరకు వచ్చి కారు నన్ను ఎక్కిస్తున్న సమయంలో లాస్ట్ లో ధమ్కీ ఈవెంట్ రావాలని అడగగా ఎన్టీఆర్ అన్న మాటిచ్చారని విశ్వక్ సేన్ పేర్కొన్నారు.

తారకరత్న మరణం సమయంలో ఎన్టీఆర్ అన్నను ఫేవర్ అడగకూడదని భావించానని విశ్వక్ సేన్ పేర్కొన్నారు. ఆ కార్యక్రమాలు పూర్తైన తర్వాత ఎన్టీఆర్ నాకు కబురు పెట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ కనుక్కున్నారని విశ్వక్ సేన్ తెలిపారు. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడం నా బాధ్యత అని ఎన్టీఆర్ మెసేజ్ పెడితే నా కళ్లలో నీళ్లు తిరిగాయని విశ్వక్ సేన్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ అన్న వస్తారని నేను చెబితే ఎవరూ నమ్మలేదని విశ్వక్ సేన్ అన్నారు.

ఇండియాలో బెస్ట్ యాక్టర్ ఎవరంటే ఎన్టీఆర్ అని నేను ఎప్పుడో చెప్పానని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు. మాస్ అమ్మ మొగుడు ఎన్టీఆర్ అని రాయాలని చెప్పి నేను రాయించానని విశ్వక్ సేన్ అన్నారు. 17 సంవత్సరాల వయస్సులో సినిమాలో తొడగొట్టి బాంబులు వేసి ఆది లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడం ఎన్టీఆర్ కు సాధ్యమైందని మళ్లీ అది హిస్టరీలో రిపీట్ కాదని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు.

ఇప్పటివరకు చూసింది తారక్ అన్న టీజర్ మాత్రమే ఇకపై అసలు సినిమా చూస్తామని విశ్వక్ సేన్ పేర్కొన్నారు. నేను పడిపోతే బాగుండు నవ్వుదాం అని చాలామంది భావిస్తున్న సమయంలో దేవుడు నాకు సపోర్ట్ గా మా తారక్ అన్నను పంపాడని విశ్వక్ తెలిపారు. నివేతా చెప్పినట్టు నాకు బ్లాక్ బస్టర్ ఇప్పటికే మొదలైపోయిందని ఆయన కామెంట్లు చేశారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus