కోలీవుడ్ స్టార్ కమెడియన్ వివేక్(59) అనారోగ్యంతో శుక్రవారం నాడు హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. తీవ్ర ఛాతీ నొప్పి రావడంతో ఆయన్ను వడపళనిలోని సిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లు తెలుస్తోంది. కార్డియాక్ అరెస్ట్ తో బాధపడుతున్న వివేక్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయన్ని ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. డాక్టర్ల ప్రత్యేక బృందం ఆయన్ని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న మరుసటిరోజే వివేక్ తీవ్ర అనారోగ్యానికి గురి కావడం కలకలం రేపుతోంది.
అయితే వ్యాక్సిన్ కు గుండెపోటు రావడానికి సంబంధం ఉందా అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. గురువారం నాడు వివేక్.. చెన్నై ఓమందూరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్ లకు, హాస్పిటల్ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు. కోవిడ్ షీల్డ్ లేదా కోవ్యాక్సిన్ వేయించుకొని ప్రాణాలను కాపాడుకోవాలని అన్నారు. ఈ వ్యాక్సిన్స్ పూర్తిగా కోవిడ్ ను అరికట్టలేకపోవచ్చు కానీ వైరస్ ఇన్ఫెక్షన్ ను కంట్రోల్ చేయగలవని అన్నారు.
ఇలా జాగ్రత్తలు చెప్పిన ఆయన ఇప్పుడు హాస్పిటల్ పాలవ్వడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. వివేక్ చివరిగా ‘ధరల ప్రభు’ అనే సినిమాలో కనిపించారు. గతేడాది మార్చిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ ను దక్కించుకుంది.
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!