అజ్ఞాతవాసి కోసం ఎవరెంత రెమ్యునరేషన్ తీసుకున్నారు ?

  • January 12, 2018 / 10:03 AM IST

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ 25 వ చిత్రం అజ్ఞాతవాసి తొలిరోజే పాతికకోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించింది. అన్నిరికార్డులను బద్దలు కొట్టి బాహుబలి కంక్లూజన్ తర్వాతి స్థానాన్ని కైవసం చేసుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ కి ముందే 150 కోట్ల బిజినెస్ చేసింది. దీంతో ఈ సినిమా కోసం ఎవరు ఎంత తీసుకున్నారు? అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. అందుకే రెమ్యునరేషన్ వివరాలు సేకరించాం. ఫిలిం నగర్ వర్గాలు చెప్పిన లెక్కల ప్రకారం.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ ఈ చిత్రం కోసం 30 కోట్ల రెమ్యున‌రేష‌న్‌ అందుకున్నారు. త్రివిక్ర‌మ్‌కు 20 కోట్లు ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఇక్కడే సినిమా బడ్జెట్ 50 కోట్లు అయింది. హీరోయిన్లుగా చేసిన కీర్తి సురేష్‌కు 1 కోటి, మ‌రో హీరోయిన్ అను ఎమ్మాన్యుయేల్‌కు 20 ల‌క్ష‌లు ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌ 3 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఇత‌ర నటీనటులకు ఇచ్చిన రెమ్యునరేషన్ మొత్తం క‌లిపి 6 కోట్లు కాగా, ప్రొడ‌క్ష‌న్ కి 13 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం.

సినిమా ప్ర‌మోష‌న్‌కు మ‌రో 2 కోట్లు ఖ‌ర్చు చేశారు. దాదాపు 80 కోట్లతో నిర్మితమైన ఈ మూవీ రిలీజ్ కి ముందే నిర్మాతకు 70 కోట్ల లాభాన్ని అందించింది. అన్ని ఏరియాల్లో థియేట్రికల్ రైట్స్ ద్వారా 120 కోట్లు, తెలుగు శాటిలైట్ రైట్స్ 19 కోట్లు, ఇతర భాషల శాటిలైట్ రైట్స్ 6 కోట్లు, డిజిటల్ రైట్స్ 7 కోట్లు, ఇతర హక్కులకు 3 కోట్లు మొత్తంగా అజ్ఞాతవాసి చిత్రం రూ.155 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి రికార్డు సృష్టించింది. సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ అదనపు షోలు, సంక్రాంతి సీజన్ కారణంగా ఈ మూవీ 200 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus