‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’. టాలీవుడ్ కి ఈ మాట కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఎందుకంటారా? ఇక్కడ కొందరు నటీనటులు తమ టాలెంట్‌తో ఎంత ఎత్తుకు ఎదిగారో, అంతకంటే వేగంగా వివాదాలతో కిందకు పడిపోయారు. ముఖ్యంగా రాజకీయాలు, వ్యక్తిగత విమర్శలతో తమ కెరీర్‌ను చేజేతులా నాశనం చేసుకున్నారు. వాళ్ల నోటి దూల, వివాదాస్పద ప్రవర్తన కారణంగా ఒకప్పుడు టాప్ పొజిషన్‌లో ఉన్నవాళ్లు, ఇప్పుడు అవకాశాల్లేకుండా ఖాళీగా ఉన్నారు.
1) ప్రకాష్ రాజ్ : ఈ లిస్ట్‌లో ముందున్నది ప్రకాష్ రాజ్ అనే చెప్పాలి. సెట్స్‌లో ఆయన ప్రవర్తన కారణంగా నిర్మాతల మండలి పలుసార్లు నిషేధించింది. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా టైంలో ప్రకాష్ రాజ్ బ్యాన్ ఉంది. ఆ సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడానికి కారణం.. ఆ టైంలో ప్రకాష్ రాజ్ పై ఉన్న నిషేధమని చాలా మంది చెబుతుంటారు. ఇక ఇటీవల కాలంలో చూసుకుంటే.. పవన్ కళ్యాణ్‌పై నిరంతరం విమర్శలు చేస్తూ ప్రకాష్ రాజ్ హాట్ టాపిక్ అయ్యారు. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ కి అవకాశాలు మరింతగా తగ్గాయి. అసలే ప్రకాష్ రాజ్ కి మరో ఆప్షన్ గా రావు రమేష్ ఉన్నాడు. అలాంటప్పుడు ప్రకాష్ రాజ్ జాగ్రత్తగా ఉండాలి కదా. అయినా ఆయన తగ్గడు. తన రాజకీయ వైఖరితో తెలుగులోనే కాదు మిగతా భాషల్లో కూడా ప్రకాష్ రాజ్ కి అవకాశాలు తగ్గాయి.
2) పోసాని కృష్ణ మురళి : పోసాని కూడా సేమ్. ప్రకాష్ రాజ్ బాటలోనే ఈయన కూడా నడిచి కెరీర్ లో వెనుకబడ్డారు. ఒకప్పుడు టాప్ రైటర్‌గా, బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వెలిగిన పోసాని, రాజకీయాల్లోకి వచ్చాక, పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత దూషణలకు దిగడంతో ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు. ప్రస్తుతం ఈ మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ చేతిలో ఎక్కువ సినిమాలు లేవు.
3)’30 ఇయర్స్’ పృథ్వీ : ప్రకాష్ రాజ్ కంటే 30 ఇయర్స్ పృథ్వీ ఈ విషయంలో 2 ఆకులు ఎక్కువే చదివాడు. పవన్ కళ్యాణ్ పై ఇతను చాలా సార్లు నోరు పారేసుకుని అతని ఫ్యాన్స్ తో చివాట్లు తినడమే కాకుండా సినిమాల్లో అవకాశాలు కూడా కోల్పోయారు. ఏళ్ల పోరాటం తర్వాత వచ్చిన ఫేమ్‌ను అనవసర వివాదాలతో పోగొట్టుకున్నారు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకున్నా, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే, పైన ఇద్దరితో పోలిస్తే అడపాదడపా అవకాశాలు అందుకుంటూ కెరీర్‌ను నెట్టుకొస్తున్నారు 30 ఇయర్స్ పృథ్వీ.
4) శ్రీరెడ్డి : ఒకానొక టైంలో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు కదా. చిన్న చిన్న పాత్రలు చేసుకునే ఈమె క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు గురించి నోరు విప్పి బాగా పాపులర్ అయ్యింది. ఆ ఫేమ్ తో ఈమె తేజ వంటి దర్శకులు సినిమాల్లో ఛాన్సులు ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకుని ఈమె తన సినీ కెరీర్ ను పూర్తిగా డ్యామేజ్ చేసుకుంది.
5)రోజా : ప్రజారాజ్యం పార్టీ టైంలో చిరంజీవిపై, జనసేన వచ్చాక గ్యాప్ లేకుండా పవన్ కళ్యాణ్ పై ఈమె చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. అయినా ‘జబర్దస్త్’ వల్ల ఈమెకు పాజిటివిటీ ఏర్పడింది. కానీ మంత్రి అయ్యాక.. అధికార ప్రభుత్వం అండ చూసుకుని ఈమె తెగ రెచ్చిపోయింది. కట్ చేస్తే ఈమెకు ఇప్పుడు అవకాశాలు లేవు. ‘జబర్దస్త్’ లో కూడా ఛాన్స్ ఇవ్వకపోతే వేరే ఛానల్ కి వెళ్లి షోలు చేసుకుంటుంది.
6)యాంకర్ శ్యామల : తన టాలెంట్ తో స్టార్ యాంకర్ గా ఎదిగింది. ‘బిగ్ బాస్ 2’ తో పాటు చాలా సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది. కానీ వైసీపీ పార్టీలోకి వెళ్లినప్పటి నుండి పవన్ కళ్యాణ్ పై ఈమె చేసిన, చేస్తున్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ‘జనసేన’ గెలిచిన తర్వాత ఈమెకు పెద్ద షోలకు యాంకరింగ్ చేసుకునే ఛాన్సులు కూడా రావడం లేదు. దీంతో మళ్ళీ తన వైసిపి పార్టీని బలోపేతం చేసుకునే పనుల్లోనే తిరుగుతూ వస్తోంది.
7)కిరాక్ ఆర్పీ : సైలెంట్ గా ఉంటే సినిమాల్లో ఛాన్సులు దక్కించుకునే వాడు. కానీ అనవసరమైన కాంట్రోవర్సీల జోలికి పోయి కెరీర్ డౌన్ చేసుకున్నాడు.
8) బండ్ల గణేష్ : నటుడిగా కంటే నిర్మాతగానే బండ్ల గణేష్ పాపులర్. కానీ ఇతని నోటి దురుసు కారణంగా పెద్ద హీరోలు ఛాన్సులు ఇవ్వడం మానేశారు. పలు ఇంటర్వ్యూల్లో ఇతను ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. తర్వాత నటుడిగా బిజీ అవ్వాలని చూసినా. అది కూడా వర్కౌట్ కాలేదు.
9)షకలక శంకర్ : ఇతను కూడా ఆల్మోస్ట్ అంతే. అనవసరమైన కాంట్రోవర్సీల జోలికి పోయి మంచి కెరీర్ ను పాడు చేసుకున్నాడు.
10)’పుష్ప’ జగదీష్ : ‘పుష్ప’ సినిమాతో ఇతనికి సూపర్ క్రేజ్ వచ్చింది. ఈ సినిమాతో జగదీష్ కి చాలా పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే ఓ అమ్మాయిపై లైంగిక దాడి, బ్లాక్ మెయిలింగ్ కేసులో చిక్కుకుని బంగారం లాంటి కెరీర్ ను పాడు చేసుకున్నాడు.