పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో గెలిచిన అనంతరం.. చాలా బిజీ అయిపోయారు. అయితే అతను సినిమాల పరంగా పెండింగ్లో ఉంచిన ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి. వాటిని అతి కష్టం మీద కంప్లీట్ చేస్తున్నారు. ‘హరిహర వీరమల్లు’ జూలై చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా అంతగా ఆడియన్స్ ను మెప్పించలేదు. అయినప్పటికీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన సినిమా కావడంతో.. అటు అభిమానులు ఇటు ప్రేక్షకులు ఆ సినిమాని చూడటానికి ఆసక్తి కనబరిచారు.
అయితే కంటెంట్ పరంగా ఆ సినిమా నిరాశపరచడంతో బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేకపోయింది. అయితే సెప్టెంబర్ లో వస్తున్న ‘ఓజి’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
చిన్న గ్లింప్స్ తోనే ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వేరు. పైగా పవన్ కళ్యాణ్ రీమేక్స్, పొలిటికల్ సెటైర్స్ ఉన్న జోనర్లకు దూరంగా చేసిన సినిమా ఇది. కాబట్టి ‘ఓజి’ అనేది అభిమానులకు చాలా స్పెషల్ గా ఉండబోతుంది అని అంతా నమ్ముతున్నారు. అందుకే ‘ఓజి’ కచ్చితంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు కంబ్యాక్ మూవీ అవుతుందని కూడా అంతా ఆశిస్తున్నారు.
అది నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు ఓవర్సీస్ బుకింగ్స్ తెలియజేస్తున్నాయి. నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో అప్పుడే ‘ఓజి’ $899 K డాలర్స్ ను కొల్లగొట్టింది. పవన్ కళ్యాణ్ కి ఓవర్సీస్ లో కూడా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఈ బుకింగ్స్ చెబుతున్నాయి. ‘పుష్ప 2’ ‘కల్కి 2898 ad’ వంటి సినిమాల రికార్డులను సైతం ‘ఓజి’ బ్రేక్ చేసి నెంబర్ 1 ప్లేస్ కి చేరుకుంది. సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. ఆల్ టైం రికార్డుల లెక్కలు అన్నీ మారిపోతాయి అనే చెప్పాలి.