అంతకన్నా ఎక్కువగా అడగొద్దు : సంజన

  • July 17, 2018 / 10:09 AM IST

కన్నడ బ్యూటీ  సంజన “బుజ్జిగాడు” చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సంజన పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు సినిమాలు పెద్దగా చేయలేదు. రీసెంట్ గా వచ్చిన “దండుపాళ్యం 3” లో కీలక పాత్ర పోషించి వార్తల్లో నిలిచింది.  వీటన్నిటి కన్నా బాహుబలి నిర్మాతలు నిర్మించిన “స్వర్ణఖడ్గం”లో యువరాణిగా నటించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఇందులో ఆమె నటనకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. తాను ప్రేమలో ఉన్నానని అంగీకరించింది. “నేను ప్రేమించిన వ్యక్తి ఓ వైద్యుడు. ఓ ఆసుపత్రి చేపట్టిన హెల్త్ క్యాంపుకు నేను వెళ్లిన సమయంలో ఆయన పరిచయం అయ్యారు.

తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాను. మాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఈ విషయం మా ఇంట్లోని వారికి కూడా తెలుసు. ఇప్పటికింకా ప్రేమలోనే ఉన్నానుగా. మరిన్ని వివరాలు మాత్రం అడగవద్దు.” అని వెల్లడించింది. తమ పెళ్ళికి చాలా సమయం ఉందని, అప్పటి వరకు అతనెవరో రహస్యంగా ఉంచుతానని సంజన తన కాబోయే భర్త గురించి వివరించింది. ఇప్పుడు సైన్ చేసిన సినిమాలను పూర్తి చేసిన తరువాతనే వివాహం చేసుకుందామని కాబోయే భర్తకు స్పష్టంగా చెప్పానని, దానికి ఆయన ఒప్పుకున్నారని సిగ్గుపడుతూ చెప్పింది. తనని, తన వృత్తిని గౌరవించే భర్త రావడం ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది. ఆ సంతోషంలో సంజన ఇప్పుడు ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus