ప్రముఖ నటి అభినయ (Abhinaya) నిశ్చితార్థం జరిగింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఆమె గురించి గతకొన్ని రోజులుగా వస్తున్న పుకార్లకు సమాధానం వచ్చినట్లు అయింది. ఫలానా హీరోతో ఆమె పెళ్లి జరుగుతుందని, రిలేషన్‌లో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎంగేజ్మెంట్ పిక్‌తో పుకార్లు పటాపంచలు అయిపోయాయి. అభినయ పెట్టిన పోస్టు ప్రకారం చూస్తే.. పెళ్లి కొడుకు పేరు సన్నీ వర్మ. పూర్తి పేరు వేగేశ్న కార్తిక్.
నిజానికి వీళ్లిద్దరికీ మార్చి 9న ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు ఆమె భర్తను చూపించలేదు. ఎంగేజ్మెంట్ రింగ్స్ మాత్రమే షేర్ చేసింది. ఇప్పుడు అభినయ తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టులో భర్త పేరును ట్యాగ్ చేసింది కూడా. తన స్నేహితుడినే ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నట్టు పోస్టుల బట్టి తెలుస్తోంది. ఫొటోల ప్రకారం చూస్తే ఇద్దరి ఎంగేజ్‌మెంట్ ఓ దేవాయలంలో జరిగినట్లు అర్థమవుతోంది.
ఆయన ప్రొఫైల్ బట్టి చూస్తే ఆయనకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. వాల్ట్ బ్రూ పేరుతో హైదరాబాద్‌లో ఓ పెద్ద కేఫ్ ఉంది. అదే పేరుతో విజయవాడలో కూడా ఓ కేఫ్ రన్ చేస్తున్నారు. విశాఖపట్నంలో బీచ్ హౌస్ బార్ అనే కేఫ్‌ను రన్‌చేస్తున్నారు. ఇవి కాకుండా ఆయనకు వేరే వ్యాపారాలు కూడా ఉన్నాయని సమాచారం. రాయల్ మెరైన్ ఫుడ్ అనే సంస్థ నిర్వహిస్తున్నారు.
ఆయన హైదరాబాద్‌కి చెందిన వ్యక్తే. యూసుఫ్ గూడలోని సెయింట్ మేరీస్ కాలేజీలో చదువుకున్నారు. ఇక ఆయనకు కారు రేసింగ్ అంటే చాలా ఇష్టమని తెలుస్తోంది. ఇక అభినయ సంగతి చూస్తే.. దక్షిణాదిలో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది. ఆమెకు మాటలు రావని, చెవులు కూడా వినిపించవనే విషయం మీకు తెలిసిందే.