Aditi Rao Hydari: వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టండి.. డేటింగ్ రూమర్లపై స్పందించిన అదితి రావు!

సాధారణంగా సినిమా సెలబ్రిటీల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడం సర్వసాధారణం. ఇలా ఒక జంట పదేపదే బయట కెమెరా కంటికి కనిపించిన లేదా ఒకే జంట పలు సినిమాలలో నటించిన వారి గురించి పెద్ద ఎత్తున రూమర్లు రావడం సర్వసాధారణం.అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ వార్తలపై స్పందించి వారి గురించి వచ్చేటటువంటి వార్తలను పూర్తిగా ఖండిస్తూ ఉంటారు. మరి కొందరు ఆ వార్తలు గురించి ఏ మాత్రం స్పందించరు.

ఈ విధంగా సెలబ్రిటీల గురించి వస్తున్నటువంటి డేటింగ్ వార్తలపై స్పందించని తరుణంలో వారిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేస్తుంటాయి.ప్రస్తుతం ఇలాంటి వార్తల్లో నిలుస్తున్నారు నటి అదితి రావు హైదరి నటుడు సిద్ధార్థ. వీరిద్దరూ కలిసి మహాసముద్రం సినిమాలో నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ కావడంతో ఈ జంట ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ తరచూ పలుసార్లు కనిపించడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు పుట్టుకొచ్చాయి.

అదే విధంగా వీరిద్దరూ కలిసి హీరో శర్వానంద్ నిశ్చితార్థానికి సెలబ్రిటీ కపుల్ గా కలిసి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరూ కలిసి ఒక డాన్స్ వీడియో కూడా చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.ఈ క్రమంలోనే వీరి గురించి ఇలాంటి వార్తలు వస్తున్న తరుణంలో వీటిపై నటి అదితి రావు స్పందించారు. ఈ సందర్భంగా అదితి రావు హైదరి స్పందిస్తూ…నేను ఎవరితో ఎలాంటి రిలేషన్ లో ఉన్నాననే విషయం గురించి కాకుండా నా సినిమాల గురించి ఆలోచిస్తే బాగుంటుందనుకుంటున్నాను.

ప్రస్తుతం నేను పలు ప్రాజెక్టులతో మంచి డైరెక్టర్లతో ఎంతో బిజీగా ఉన్నాను ప్రస్తుతం తన దృష్టి మొత్తం కెరియర్ పైనే ఉందని తెలిపారు. నన్ను ప్రేక్షకులు నటిగా అంగీకరించినంత వరకు నటిస్తూనే ఉంటాను.దయచేసి నా వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టి వృత్తిపరమైన విషయాల గురించి మాట్లాడండి అంటూ ఈ సందర్భంగా డేటింగ్ రూమర్లపై స్పందిస్తూ ఈమె ప్రస్తుతం సినిమాలపైనే ఫోకస్ పెట్టాను అంటూ తెలియజేశారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus