పోలీసులకు లొంగిపోయిన అమలాపాల్!

  • January 17, 2018 / 11:23 AM IST

ప్రేమ ఖైదీ సినిమాలో అమాయకమైన గ్రామీణ అమ్మాయిగా అమలాపాల్ నటించి తెలుగువారి మనసు దోచుకుంది. ఆ తర్వాత ఇద్దరమ్మాయిలతో, నాయక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత ప్రేమ, పెళ్లి.. విడాకులు .. వంటి కారణాలతో సినిమాలకు దూరమైంది. 2015 లో వచ్చిన “జెండాపై కపిరాజు” చిత్రం తర్వాత కనిపించలేదు. తాజాగా “ఆయుష్మాన్ భవ” సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ బ్రేక్ లో ఉన్న అమలాపాల్ పోలీసులకు లొంగిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే…  అమలాపాల్‌ కొన్ని రోజుల క్రితం 1.5 కోట్లతో కారుని కొనుగోలు చేసింది.

పన్ను తక్కువగా పడుతుందని  ఆ కారుకు  పుదేచ్చేరిలో రిజిస్టర్‌ చేయించుకుంది. పుదుచ్చేరిలో రిజిస్టర్‌ చేయించుకున్న కారును కేరళలో పన్ను కట్టకుండా నడపడంతో రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖకు నష్టం కలిగిందట. దాంతో అమలాపాల్‌పై కేరళలో సెక్షన్ 430, 468, 471 కింద కేసు నమోదు చేశారు. అయితే ఆమె ఇటీవల కేరళ హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. ఈ కేసును తర్వాత పరిశీస్తామని చెప్పిన కోర్టు, అమలాపాల్‌ని వెంటనే క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. దీంతో ఆమె నిన్న పోలీసుల ఎదుట లొంగిపోయారు. అమలాపాల్ ని బయటికి తీసుకురావడానికి ఆమె తరపు న్యాయవాది ప్రయత్నిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus