సొంత ఊరు, సొంత భూమి, సొంత జనాలు.. ఇలాంటి వాటిపై మక్కువ ఎక్కువగానే ఉంటుంది. సెలబ్రిటీలు ఇందుకు అతీతం కాదు. ఓ నటి తన తల్లిదండ్రులకు చెందిన భూమి వద్దకి వెళ్లొస్తూ ఉంటుంది. కానీ ఆ భూమిపై చాలా కాలంగా వివాదం నడుస్తోంది. ఆ గొడవ పెరిగి పెద్దదై నటి తలపగలగొట్టే స్థాయికి వెళ్ళింది. ఈ సంఘటన కస్పాడిలో(సాగర్ తాలుక్, షిమోగా డిస్ట్రిక్ట్) చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..శాండల్ వుడ్ కి చెందిన నటి అను గౌడకి కస్పాడిలో కొంత భూమి ఉంది.
ఇక్కడ (Anu Gowda) ఆమె తల్లిదండ్రులు వ్యవసాయం కూడా చేసేవారు. నెలకోసారైనా ఆమె బెంగళూరు నుండి ఇక్కడకు వస్తూ ఉంటుంది. మరోపక్క ఈ భూమి గురించి వివాదం కూడా నడుస్తోంది. ఈ భూమి వారిదంటూ కొందరు ఈమెతో గొడవ పెట్టుకుంటూ వచ్చారు. అయితే ఈసారి ఈమె కస్పాడి వెళ్ళినప్పుడు.. నీలమ్మ, మోహన్ లు ఈమె పై దాడి చేయడం జరిగింది. ఈ క్రమంలో అను తలకి బలమైన గాయమవ్వడంతో ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ప్రస్తుతం ఆమె బాగానే ఉంది.
కానీ కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోమని డాక్టర్లు సూచించారట.మరి ఈమె భూమి వివాదం ఏమవుతుందో చూడాలి. పోలీస్ కంప్లైంట్ అయితే ఫైల్ చేసినట్లు సమాచారం. అను గౌడ కన్నడ సినిమాల్లో, సీరియల్స్ లో నటిస్తూ బిజీ యాక్ట్రెస్ గా రాణిస్తుంది. తమిళంలో కూడా ఆమె పలు సినిమాల్లో నటించింది. మౌనమా నీరమ్, కలకల్, శంకర వంటి చిత్రాల్లో నటించి క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. కన్నడలో సుదీప్ తో కెంపెగౌడ, విష్ణువర్థన్‌తో స్కూల్ మాస్టర్ వంటి సినిమాల్లో ఈమె నటించింది.
సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!