Anupama: ఎప్పటికైనా మెగా ఫోన్ పట్టుకుంటాను.. అనుపమ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. తాజాగా ఈమె నిఖిల్ హీరోగా నటించిన 18 పేజెస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతో ఉన్నటువంటి అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అనుపమ పరమేశ్వర తన సినీ కెరియర్ గురించి తన కోరికల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. నటిగా తనకు ఎన్నో సినిమాలలో నటించాలని ఉందని తెలిపారు. ఇప్పటివరకు తాను ఎక్కువగా ప్రేమకథా చిత్రాలలోనే నటించానని ఈ సందర్భంగా ఈమె గుర్తు చేసుకున్నారు. ఇలా ఇంకా మరెన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని ఉంది అంటూ తెలియచేశారు.

ఇక నటన కాకుండా తనకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టమని తన కోరికను బయటపెట్టారు. తన జీవితంలో ఒక్కసారి అయినా తాను మెగా ఫోన్ పట్టుకోవాలనేది తన కోరిక అని తెలిపారు. అయితే తాను ఎప్పుడైతే దర్శకత్వం వహించాలని కోరుకుంటానో ఆ సమయంలో ఒక సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి మంచి డైరెక్టర్ల దగ్గర శిష్యరికం తీసుకుంటానని తెలిపారు.

ఈ విధంగా సంవత్సరం పాటు శిక్షణలో భాగంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మెలకువలు అన్ని నేర్చుకుంటానని తెలిపారు. ఇకపోతే ఇప్పటికే తన మదిలో కొన్ని కథనాలు ఉన్నాయని తెలిపారు. అయితే నటిగా తాను ఇంకా మరికొన్ని సినిమాలలో నటించాలని ఉందని అందుకే ప్రస్తుతం తాను డైరెక్షన్ డిపార్ట్మెంట్ పై కాకుండా నటన పైనే దృష్టి పెట్టానని తెలిపారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus