Anushka Sharma: వైరల్ అవుతున్న అనుష్క శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు.. చెప్పిన విషయాలివే!

బాలీవుడ్ ఇండస్ట్రీలో అనుష్క శర్మకు (Anushka Sharma) నటిగా మంచి గుర్తింపు ఉంది. అనుష్క శర్మ విరాట్ కోహ్లీ సతీమణి అనే సంగతి తెలిసిందే. టీ 20 వరల్డ్ కప్ లో భారత్ సాధించిన ఘన విజయం భారతీయులకు ఎంత సంతోషాన్ని కలిగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీ 20 వరల్డ్ కప్ లో ఇండియా గెలిచిన తర్వాత తన కూతురు చేసిన పని గురించి అనుష్క శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత టీమిండియా ప్లేయర్స్ ఎమోషనల్ అయ్యి కంటతడి పెట్టుకున్నారని అనుష్క శర్మ వెల్లడించారు. ఈ దృశ్యాలను చూసిన నా కూతురు వారిని కౌగిలించుకోవడానికి ఎవరైనా ఉన్నారా అని ఆందోళన చెందిందని అనుష్క శర్మ పేర్కొన్నారు. ఆ సమయంలో నేను నా కూతురితో “డార్లింగ్ నువ్వు బాధ పడకు.. వాళ్లను 150 కోట్ల భారతీయులు ప్రేమతో కౌగిలించుకుంటున్నారు.. ఛాంపియన్స్ కంగ్రాట్స్” అని చెప్పానని అనుష్క శర్మ పేర్కొన్నారు.

అదే సమయంలో అనుష్క శర్మ విరాట్ కోహ్లీని ఎంతగానో ప్రేమిస్తున్నానని చెప్పుకొచ్చారు. నువ్వు నా వాడివి అని చెప్పుకునేందుకు కృతజ్ఞురాలినని ఆమె వెల్లడించారు. విరాట్ కోహ్లీ ట్రోఫీని పట్టుకున్న ఫోటోలను అనుష్క శర్మ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. విరాట్ కోహ్లీ మ్యాచ్ తర్వాత అనుష్క శర్మ, కూతురుకు కాల్ చేసి వీడియో కాల్ లో మాట్లాడటం జరిగింది.

మరోవైపు బీసీసీఐ టీం ఇండియాకు 125 కోట్ల రూపాయల నజరానా ప్రకటించడం జరిగింది. 2013 తర్వాత టీం ఇండియా ఐసీసీ ట్రోఫీ నెగ్గడం ఇదే తొలిసారి అనే సంగతి తెలిసిందే. టీం ఇండియా ఘన విజయంతో క్రికెట్ లవర్స్ సంతోషానికి ఏ మాత్రం అవధులు లేకుండా పోయాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus