సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క అంటే సినీ ప్రియులకు ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు. ఈమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొద్దికాలంలోనే స్టార్ హీరోయిన్ గా వెలిగింది. అలాంటి ఈ ముద్దుగుమ్మ లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో సైతం నటించి మెప్పించింది. అరుంధతి, పంచాక్షరి,భాగమతి, నిశ్శబ్దం వంటి సినిమాల్లో నటించి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచింది. ఒకసారి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ అనుష్క తన సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు చెప్పింది.
టీనేజ్‌లో ఉన్నపుడు సినిమా స్టార్లు, క్రికెటర్ల మీద ఎఫెక్షన్ పెంచుకోవడం సహజం, తను కూడా స్టార్ క్రికెటర్‌ను ప్రేమించానని తెలిపింది. ‘రాహుల్ ద్రవిడ్ నా అభిమాన క్రికెటర్. నా చిన్నతనం నుంచి అతనంటే నాకు పిచ్చి. ఎంతలా అంటే ఒకానొక సమయంలో ద్రవిడ్‌తో పీకల్లోతు ప్రేమలో పడిపోయా’ అని అనుష్క వెల్లడించారు. ప్రస్తుతం తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, పెళ్లి గురించి ఆలోచించే సమయం కూడా లేదని అనుష్క పలు సందర్భాల్లో వెల్లడించారు.
ప్రస్తుతం తన ఫోకస్ అంతా కెరీర్ మీదనే ఉందని (Anushka) అనుష్క తెలిపారు. అలాంటి ఈ ముద్దుగుమ్మకు అరుంధతి సినిమాతో ఎక్కడలేని క్రేజ్ వచ్చి పడింది. అయితే గత కొద్దికాలం నుండి అనుష్క ప్రభాస్ మధ్య లవ్ ఉందని,వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో మాత్రం ఇప్పటికీ ప్రభాస్ అనుష్క స్పందించడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు. ఒకవేళ స్పందించినా కూడా మేము జస్ట్ ఫ్రెండ్స్ అంతే మా మధ్యన ఏమీ లేవు అంటూ కప్పి పంచుకుంటున్నారు.
మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!
మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!