ఓంకార్ కు ఈ యంగ్ హీరోయినయినా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?

ఓంకార్ డైరెక్షన్లో వచ్చిన ‘రాజుగారి గది’ చిత్రం బ్లాక్ బస్టర్ కాగా… ఆ తరువాత వచ్చిన ‘రాజుగారి గది2’ చిత్రం యావరేజ్ గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి మరో సీక్వెల్ ను ప్రారంభించాడు దర్శకుడు ఓంకార్. అదే ‘ రాజుగారి గది-3 ‘. ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ సీక్వెల్ కు ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర కోసం తమన్నాను ఎంచుకున్నాడు ఓంకార్. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకుంది. తరువాత బాలీవుడ్ వరుసగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ హిట్లు మీద హిట్లు కొడుతున్న తాప్సి ను సంప్రదించాడట దర్శకుడు ఓంకార్. అయితే ఆమె మరో రెండు ప్రాజెక్టులకి కమిటవ్వడంతో ఆమె కూడా చేయలేనని చెప్పిందట.

అటుతరువాత కాజల్ ను తీసుకోవాలని అనుకున్నప్పటికీ .. ఆమె రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేయడంతో ఆమెను కూడా లైట్ తీసుకున్నట్టు తెలుస్తుంది.
ఇప్పుడు ఓంకార్ కు హీరోయిన్ దొరకడం చాలా కష్టంగా మారింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం… ‘ఉయ్యాలా జంపాలా’ ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ ‘సినిమా చూపిస్తా మావ’ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి హిట్టు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అవికా గౌర్ ను తీసుకోవాలని ఓంకార్ ప్రయత్నాలు మొదలుపెట్టాడట. మరి ఈ యంగ్ హీరోయిన్ అయినా…. ఒప్పుకుంటుందేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus