రాజమౌళి ఆమెనే హీరోయిన్ గా ఎంపిక చేశారా?

బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకోవడంతో మహేష్ జక్కన్న కాంబినేషన్ మూవీపై రిలీజ్ కు ముందే అంచనాలు పెరిగాయి. దేశంలో కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడటంతో మహేష్ జక్కన్న కాంబో మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 2023 సంవత్సరం ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం శ్రద్ధాకపూర్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేశారని బోగట్టా.

సాహో సినిమాతో శ్రద్ధా కపూర్ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్లను సాధించింది. అయితే ఈ సినిమాకు బిజినెస్ అంచనాలకు మించి జరగడంతో కలెక్షన్లు మాత్రం ఎక్కువగా రాలేదు. మహేష్ శ్రద్ధా కపూర్ జోడీ బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా శ్రద్ధా కపూర్ కు మంచి పేరుంది. శ్రద్ధా కపూర్ ఇతర హీరోయిన్లతో పోల్చి చూస్తే పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకుంటారు.

శ్రద్ధా కపూర్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేయడం వల్ల సినిమాకు ఆమె ప్లస్ అవుతుంది తప్ప మైనస్ కాదు. అయితే శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో నిజంగా హీరోయిన్ గా ఎంపికైందో లేదో తెలియాలంటే మేకర్స్ స్పందించే వరకు ఆగాల్సిందే. మరోవైపు అటు మహేష్ ఇటు రాజమౌళి సినిమాకు సంబంధించి ఎలాంటి విషయాలను వెల్లడించడం లేదు. రాజమౌళి పాన్ వరల్డ్ టార్గెట్ గా తర్వాత సినిమాలను తెరకెక్కించనున్నారని సమాచారం అందుతోంది.

రాజమౌళి మహేష్ కాంబో మూవీ 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుండగా సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మహేష్ ఈ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకోనున్నారని తెలుస్తోంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus