Ustaad Bhagat Singh: కొడుకు.. అల్లుడు.. ఇప్పుడు మామ.. ఆ హీరోయిన్‌కి భలే కలిసొస్తోందే!

ఒక్క మెగా హీరోతో సినిమా తీస్తే.. మెగా హీరోయిన్‌ అనిపించుకోవచ్చా? ఏమో మరి గతంలో ఒకరిద్దరిని, ఇప్పుడు సాక్షి వైద్యను చూస్తే అలానే అనిపిస్తోంది. వరుణ్‌ తేజ్‌ ‘గాండీవధారి అర్జున’ అనే సినిమా చేస్తున్న సాక్షి.. ఇప్పుడు మరో రెండు మెగా హీరోల సినిమాలు చేయబోతోంది అని సమాచారం. దీనిపై అధికారిక సమాచారం అయితే లేదు కానీ.. పక్కాగా ఆమెను సంప్రదించారు అని మాత్రం సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టమైన ప్రకటన ఉంటుంది అని చెబుతున్నారు.

వరుణ్‌ తేజ్‌ – ప్రవీణ్‌ సత్తారు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘గాండీవధారి అర్జున’. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలవుతోంది. అయితే ఈ సినిమా సెట్స్‌ మీద ఉండగానే మరో సినిమాను ఓకే చేసుకుంది అని ఆ మధ్య వార్తలొచ్చాయి. సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా రూపొందబోయే ఓ సినిమాలో సాక్షిని కథానాయికగా తీసుకున్నారని సమాచారం. ఈ రెండు సినిమాలకు నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ కావడం గమనార్హం.

అయితే ఇప్పుడు సాక్షి వైద్య మరో మెగా సినిమాలో నటిస్తోందని అంటున్నారు. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ కోసం ఆమెను సంప్రదించారు అని టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాలో తొలుత ఇద్దరు హీరోయిన్లు ఉంటారు అని టాక్‌ వచ్చింది. పూజా హెగ్డే, శ్రీలీల ఆ హీరోయిన్లు అని కూడా చెప్పారు. అయితే ఆ తర్వాత పూజ ఈ సినిమా (Ustaad Bhagat Singh) నుండి తప్పుకుంది. దీంతో మరో నాయిక ప్లేస్‌ ఖాళీగా ఉంది. ఆ సీటు సాక్షికి దక్కింది అంటున్నారు.

కరోనా – లాక్‌డౌన్‌ సమయంలో రీల్స్‌, షార్ట్‌ వీడియోలతో సాక్షి వైద్య సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయ్యింది. ఆ తర్వాత అఖిల్ – సురేందర్‌ రెడ్డి ‘ఏజెంట్‌’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింద. ఆ సినిమా సెట్స్‌ మీద ఉండగానే ‘గాండీవధారి అర్జున’ సినిమాలోకి తీసుకున్నారు. ఇప్పుడు ఆ సినిమా ఇంకా విడుదల కాకుండానే మరిన్ని సినిమాలు సంపాదిస్తోంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus