Gauthami: పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన నటి గౌతమి.. ఏమైందంటే?

సీనియర్ నటి గౌతమి అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. తర్వాత తమిళంలో ఎక్కువ ఆఫర్లు రావడంతో అటు వైపు మళ్ళింది. అక్కడ అనేక హిట్ సినిమాల్లో నటించింది. ఆమె మొదట సందీప్ భాటియా అనే బిజినెస్ మ్యాన్ ను 1996 లో పెళ్లి చేసుకుంది. కానీ 1999 లో వీళ్ళు మనస్పర్థల కారణంగా విడిపోయారు. తర్వాత గౌతమి క్యాన్సర్ బారిన పడటం జరిగింది. ఆ టైంలో కమల్ హాసన్ ఈమెను చేరదీసి చికిత్స అందించింది.

తర్వాత వీళ్ళు 12 ఏళ్ళ పాటు సహజీవనం చేసి 2016 లో విడిపోవడం జరిగింది. ఇదిలా ఉండగా.. గౌతమి మళ్ళీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.మరోపక్క ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలో కొన్ని ఆస్తులను అమ్మేయాలని ఆమె డిసైడ్ అయ్యారు. దీంతో అలగప్పన్ అనే ఏజెంట్‌ సాయం కోరారు. అయితే అళగప్పన్ గౌతమి ఆస్థి పై కన్నేశాడట. ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలు సృష్టించి ఆమె ఆస్తి కొట్టేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.

గౌతమి చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తుంది. ఆమె పోలీస్ ఫిర్యాదులో “శ్రీపెరంబుదూర్‌లో ఉన్న ఆమె రూ. 25 కోట్ల విలువైన ఆస్తి, స్థిరాస్తిని బిజినెస్ మెన్, ఏజెంట్ అయిన అలగప్పన్ కబ్జా చేశాడని ఆమె పేర్కొంది. దీనిపై ఆమె అళగప్పన్ ను నిలదీస్తే.. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చూపించి.. తనని, తన కుమార్తెను చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఆమె రాసుకొచ్చింది.

తన ఆస్తిని తనకు తిరిగి ఇప్పించాలని ఆమె ఫిర్యాదు లో విన్నపించుకున్నట్టు కూడా తెలుస్తుంది. గౌతమి కంప్లైంట్ ను పరిశీలించిన పోలీసులు..అలగప్పన్ ను విచారించే పనులు మొదలు పెట్టినట్టు సమాచారం.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus