ప్రముఖ సీనియర్ నటి గీతాంజలి గురువారం నాడు మరణించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకస్మాత్తుగా ఆమె మరణించడం అందరినీ షాక్ కు గురిచేసింది. హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆమెను హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అయితే చికిత్స పొందుతూనే ఆమె కన్నుమూశారు. ఇక గీతాంజలి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి. ఈమె తెలుగుతో పాటు మళయాళం, హిందీ చిత్రాల్లో కూడా నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.
ఇక గీతాంజలి గారి వయసు 62 ఏళ్ళు. ఈమె ఎన్టీఆర్ , ఏఎన్నార్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించారు. ‘సీతారామ కళ్యాణం’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం 1961లో విడుదలయ్యింది. ఈ చిత్రంలో గీతాంజలి గారు సీత పాత్రలో అలరించారనే చెప్పాలి. ఆ చిత్రంతో ఆమెకు మంచి క్రేజ్ ఏర్పడడంతో ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన ఆవరసరం ఆమెకు రాలేదు. ‘డాక్టర్ చక్రవర్తి’ ‘బొబ్బిలియుద్దం’ ‘దేవత’ ‘గూఢచారి 116’ వంటి ఎన్నో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు గీతాంజలి. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రీ ఎంట్రీ ఇచ్చి ‘పెళ్ళైన కొత్తలో’ ‘మొగుడు’ ‘గ్రీకు వీరుడు’ వంటి చిత్రాల్లో నటించారు. అన్ని భాషలు కలుపుకుని ఆమె 400 వందలకు పైగా సినిమాల్లో నటించారు.
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!