Kajal Aggarwal: స్టార్ హీరోయిన్ గ్లామర్ కి కారణమిదే!

సినిమా హీరోయిన్లు తమ ఫిజిక్ ను అంత పెర్ఫెక్ట్ గా ఎలా మైంటైన్ చేయగలరు..?అసలు వాళ్లు ఏం తింటారో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంటుంది. హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు అవుతోంది. ఇప్పటికీ అంతే గ్లామరస్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా తన గ్లామర్ సీక్రెట్ ను బయటపెట్టింది ఈ బ్యూటీ. తన డైలీ డైట్ చాలా సింపుల్ అని అంటోంది. ఉదయం లేవగానే కాజల్ ఎగ్స్ తింటుంది.

ఆ తరువాత గంట గ్యాప్ ఇచ్చి ఏదో ఒక కర్రీతో చేసిన జొన్న రొట్టెలు తింటుంది. ఆ తరువాత లంచ్ కు రెండు గంటల ముందు ఓ ఫ్రూట్ తింటుంది. ఇక మధ్యాహ్న భోజనంలో భాగంగా పప్పు, అన్నం, కూరగాయలు తింటుంది. సాయంత్రం ఏదైనా టోస్ట్ లేదా శాండ్ విచ్ తింటుంది. ఇక డిన్నర్ లో మధ్యాహ్నం తిన్న భోజనమే రిపీట్ చేస్తుంది. రోజంతా మధ్యమధ్యలో ప్రోటీన్ షేక్ లేదా కొబ్బరి నీళ్లు తాగుతుంది. వీటికి అదనంగా పొద్దున్న, సాయంత్రం ఎర్ల్ గ్రే టీ తాగుతుంది.

కాజల్ పూర్తి శాఖాహారి. కాబట్టి ఆమె ప్రోటీన్ షేక్స్ కు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంది. కాజల్ కు రాజ్మా చావల్, పన్నీర్, పరాఠాలు అంటే ఇష్టమని చెబుతోంది. ఆంధ్రా వంటకాలు కూడా ఇష్టమని చెబుతోంది. ఇక ఆమె బ్యూటీ సీక్రెట్ చెబుతూ.. ఐఎస్ అనే బ్రాండ్ కు చెందిన సౌందర్య ఉత్పత్తులను మాత్రమే ఉపయోగిస్తానని చెప్పింది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus