Kangana: వైరల్ అవుతున్న కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్!

వివాదాస్పద విషయాల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న కంగనా రనౌత్ ఏ విషయం గురించి అయినా బోల్డ్ గా మాట్లాడతారనే సంగతి తెలిసిందే. జక్కన్నకు వ్యతిరేకంగా వ్యక్తమవుతున్న కామెంట్ల గురించి కంగనా రనౌత్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కంగనా తన ట్విట్టర్ లో రాజమౌళి గురించి ట్వీట్ చేస్తూ మీరు దీనిపై అతిగా స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. మేము అందరి కోసం సినిమాలు చేస్తామని చెప్పారు.

కళాకారులకు స్పెషల్ గా రైట్ వింగ్ మద్దతు లభించదని ఆమె తెలిపారు. జాతీయవాది, మేధావి అయిన జక్కన్నకు వ్యతిరేకంగా దేనినీ నేను సహించనని కంగనా పేర్కొన్నారు. రాజమౌళి సార్ దేశాన్ని ప్రేమిస్తున్నారని ప్రాంతీయ సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారని ఆమె తెలిపారు. రాజమౌళి దేశం పట్ల అంకిత భావం కలిగి ఉన్నారని జక్కన్న సమగ్రతను ప్రశ్నించడానికి మీకు ఎంత ధైర్యమని కంగనా కామెంట్లు చేశారు.

మరో ట్వీట్ లో కంగనా రనౌత్ ప్రపంచం రాజమౌళిపై వివాదాస్పద ముద్ర ఎందుకు వేసిందని అన్నారు. జక్కన్న చేసిన వివాదం ఏమిటని నాగరికత, జాతి గర్వించేలా బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ సినిమాలు తీసినందుకు అతనిపై వివాదాస్పద ముద్ర వేయాలా? అని ఆమె ప్రశ్నించారు. తాజాగా జక్కన్న ఒక ఇంటర్వ్యూలో మతం, హిందూ గంథాల గురించి అభిప్రాయాలను వెల్లడించడం జరిగింది.

ఆ సమయంలో రాజమౌళి రామాయణం, మహాభారతంపై తనకు ప్రేమ ఉందని అన్నారు. అయితే మతపరమైన అంశాలకు దూరంగా ఉంటానని ఆయన తెలిపారు. రాజమౌళి చేసిన కామెంట్లపై కొంతమంది వివాదాలు సృష్టించడంతో కంగనా ఈ విషయాలను చెప్పుకొచ్చారు. కంగనా రియాక్షన్ నేపథ్యంలో విమర్శలు చేసిన వాళ్లు సైలెంట్ అవుతారేమో చూడాల్సి ఉంది. ఈ కామెంట్ల గురించి జక్కన్న నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. జక్కన్నకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus