Actress Kavitha: టాలీవుడ్ నటి కవిత ఇంట్లో విషాదం!

కరోనా వైరస్ సినిమా ఇండస్ట్రీలో కూడా అనేక విషాధాలను మిగిల్చింది. ఎంతోమంది ప్రముఖులతో పాటు జూనియర్ ఆర్టిస్టులు కూడా కరోనా భారిన పడుతున్నారు. ఇక లాక్ డౌన్ అనంతరం కాస్త మరణాల సంఖ్య తగ్గుతుందని అనుకున్న సమయానికి మరొక సిమియర్ నటి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొనడం అందరిని షాక్ కు గురి చేసింది.

గతంలో హీరోయిన్ గానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ తో మెప్పించిన సీనియర్ నటి కవిత కుటుంబానికి తీరని విషాదం మిగిల్చింది. ఆమె కొడుకు సంజయ్ రూప్ ఇటీవల వైరస్ వలన కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్ చికిత్స అందుకుంటున్న సంజయ్ బాగానే కొలుకుంటున్నాడని అనుకుంటున్న తరుణంలో సడన్ గా మృతి చెందడం కవిత కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది.

ఓ వైవు కొడుకు మృతితో బాధపడుతున్న కవిత భర్త ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆయన కూడా కరోనా భారిన పడడంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కవిత కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ మళయాళం కన్నడ భాషల్లో కూడా సపోర్టింగ్ రోల్స్ తో మంచి గుర్తింపు అందుకుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలో చేసిన నెగిటివ్ పాత్రకు మంచి గుర్తింపు దక్కింది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus