నాపై నాకే అసహ్యం వేసేలా కామెంట్స్ చేశారు: కీర్తి సురేష్ సోదరి

ప్రస్తుత రోజుల్లో బరువు పెరగాలి అంటే పెద్దగా కష్టపడాల్సి అవసరం లేదని చెప్పవచ్చు. కానీ తగ్గాలి అంటే మాత్రం చెమటలు చిందించాల్సిందే. ఈ రోజుల్లో కొందరికి ఫిట్నెస్ అనేది అతిపెద్ద టార్గెట్ లా మారింది. ముఖ్యంగా సెలబ్రెటీల లైఫ్ లో వర్కౌట్స్ లేకపోతే ఫెడౌట్ అయిపోవడం కాయం. అందుకే డైటింగ్ వర్కౌట్స్ అంటూ హడావుడిగా కనిపిస్తుంటారు. లేకపోతే బరువు వల్ల అవమానాలు తప్పవు. ఇక కీర్తి సురేష్ అక్క రెవతి సురేష్ బరువుగా ఉండడం వల్ల చాలా అవమానాలను ఎదుర్కొందట.

అసలు నువ్వు ఎలా ఉన్నావు? మీ చెల్లి, అమ్మ ఎలా ఉన్నారు. ఎందుకు ఇంత లావుగా ఉన్నావు అని నాపై నాకే అసహ్యం కలిగేలా విమర్శలు ఎదుర్కొన్నట్లు వివరణ ఇచ్చిన రేవతి ఒక టార్గెట్ తో అందరి నోళ్లు మూయించింది. కీర్తి సురేష్ సపోర్ట్ తో ఆమె వర్కౌట్స్ చేసి నార్మల్ లుక్ లోకి వచ్చేసింది. ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో ఆమె పోటో పోస్ట్ చేసింది. ఒకవైపు బరువుగా ఉన్నప్పటికీ లుక్ మరోవైపు నార్మల్ లుక్ ను ప్రజెంట్ చేసింది. అసలు అందులో ఉన్నది రేవతి కాదని కామెంట్స్ వచ్చేలా చేసుకుంది.

అద్దం ముందు నిలబడి నాలో లోపం ఏముంది? బరువు పెరగడమే పెద్ద లోపమా అంటూ తనను తాను చాలా సార్లు ప్రశ్నించుకున్నట్లు కూడా రేవతి వివరణ ఇచ్చింది. మొత్తానికి ఇప్పుడు రేవతి తన చెల్లి తల్లి కంటే అందంగా ఉన్నట్లు కామెంట్స్ అందుకుంటోంది.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus