మహిళల గౌరవాన్ని కాపాడడానికి పోరాడతా!

సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూను చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వీసీకే అధినేత తిరుమావళవన్‎ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఆమెని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమావళవన్‎ మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఖుష్బూ నేతృత్వంలోని బీజేపీ నేతలు మంగళవారం నాడు నిరసన నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నిరసనకు పోలీసుల నుండి అనుమతి రాలేదు.

అయినప్పటికీ ఈ ఆందోళనలో పాల్గొనడానికి వెళ్తున్న కుష్బూను ఈసీఆర్‌ రోడ్డులో అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. కుష్బూతోపాటు మరికొంత మంది మహిళానేతలు, ఇతరలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తరుణంలో గౌండంబాడిలో వీసీకే, బీజేపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఇరువర్గాల నేతలు ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నారు. ఈ ఘర్షణలో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగితే గానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. తిరుమావళవన్ ఇటీవల యూట్యూబ్ ఛానెల్ లో మహిళల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కుష్బూ ఆరోపించారు.

ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేశామన్నారు. తన చివరి శ్వాస వరకు మహిళల గౌరవాన్ని కాపాడేందుకు పోరాడతానని కుష్బూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus