Kushboo: మళ్ళీ హాస్పిటల్ పాలైన కుష్బూ.. వైరల్ అవుతున్న పోస్ట్!

నటిఒకప్పటి స్టార్ హీరోయిన్, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన కుష్బూ హాస్పిటల్ బెడ్ పై పడుకుని ఉన్న ఓ ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఫోటోని పోస్ట్ చేసింది కుష్బూనే. దీంతో ఏమైందా? అంటూ ఆమె ఫాలోవర్స్ కంగారు పడుతున్నారు. దీనికి ఆమె పోస్టులోనే క్లారిటీ ఇచ్చింది. ‘కోకిక్స్ బోన్ (టెయిల్ బోన్) ట్రీట్మెంట్ కోసం కోసం మళ్ళీ హాస్పిటల్ లో చేరాల్సి వచ్చింది. ప్రస్తుతం బాగానే ఉంది.. మెల్లగా కోలుకుంటున్నాను.

త్వరలోనే పూర్తిగా కోలుకుంటానని భావిస్తున్నాను’ అంటూ కుష్బూ రాసుకొచ్చింది. కాబట్టి ఆమె ఫాలోవర్స్ కంగారు పడాల్సిన పనిలేదన్న మాట. ఏప్రిల్ నెలలో కూడా ఈమె ‘ఎడినో’ వైరస్‌ భారిన పడి హాస్పిటల్ పాలైంది. ఈ వైరస్‌ సోకినవారికి జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం వంటి సమస్యలు ఎక్కువ ఉంటాయి. కుష్బూకి కూడా వాటితోనే ఇబ్బందిపడుతున్నట్టు అప్పుడు చెప్పుకొచ్చింది. అయితే ఆమె త్వరగానే కోలుకుంది. తర్వాత ‘రామబాణం’ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఆమె చురుగ్గా పాల్గొంది.

ఇప్పుడు మళ్ళీ ఆమె హాస్పిటల్ పాలైనట్లు స్పష్టమవుతుంది. ఇక..కుష్బూ (Kushboo)  ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూనే మరోపక్క రాజకీయాల్లో కూడా రాణిస్తుంది. బీజేపీ నాయకురాలు, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అయిన ఖుష్బూ.. ఏ టాపిక్ పై అయినా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. ఒక్కోసారి ఈమె కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరుగుతుంటుంది. అయినా సరే ఈమె తన మనసులో ఉన్న భావాన్ని వ్యక్తపరిచే అలవాటుని మాత్రం మానుకోలేదనే చెప్పాలి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags