సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ వరుస ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా ఫిలిం ‘జైలర్’ షూటింగ్ నుండి కాస్త గ్యాప్ తీసుకుని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు. వీలు చేసుకుని సినిమా వాళ్లను కలుస్తున్నారు. ‘కాంతార’ సినిమా చూసి రిషబ్ శెట్టిని కలిసి మాట్లాడాారాయన. రజినీ ఆహ్వానం మేరకు రిషబ్, చెన్నైలోని నివాసంలో రజినీని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. రజినీ ఒక్కసారి దీవిస్తే వందసార్లు ఆశీర్వదించినట్లేనంటూ పిక్స్ పోస్ట్ చేశాడు రిషబ్.
రీసెంట్గా సీనియర్ నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్.. రజీని కాంత్‌ని ఆయన నివాసంలో కలిశారు. రజినీని ఎప్పుడు కలిసి చాలా సంతోషంగా అనిపిస్తుందని.. ప్రేమతో ఆయన మాట్లాడిన విధానాానికి థ్యాంక్స్.. అంటూ ఫొటోలు షేర్ చేశారామె. రజినీతో టీ తాగడం, ఆప్యాయంగా ముచ్చటించడం మర్చిపోలేని అనుభూతి అని చెప్పుకొచ్చారు ఖుష్బూ. హీరోయిన్‌గానే కాకుండా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక ‘అన్నాత్తే’ (పెద్దన్న) మూవీలోనూ రజినీతో యాక్ట్ చేశారు ఖుష్బూ.