Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?
- October 23, 2026 / 07:07 PM ISTByFilmy Focus Desk
సినిమాలో కేమియోలు ఉండటం వేరు.. కేమియోల మధ్యలో సినిమా ఉండటం వేరు. తొలి రకం సినిమాలు మీరు చాలానే చూసి ఉంటారు. రెండో రకం మాత్రం చాలా తక్కువ ఉంటాయి. అలాంటి ఓ సినిమా ఇప్పుడు థియేటర్లలో ఆడుతోంది. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మేం చెప్పిన సినిమా ఏంటో.. యస్ మీరు అనుకుంటున్నదే ‘జైలర్ 2’. ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్ ప్రధాన పాత్రల్లో ఆరేడు కేమియోలతో రూపొందిన సినిమా ఇది.
Tollywood
బాక్సాఫీసు దగ్గర భారీ విజయం అందుకున్న ‘జైలర్ 2’ సినిమా.. తొలి వారంలో రూ.500 కోట్లకుపైగా వసూళ్లు అందుకుంది. సినిమా జోరు, ఇతర సినిమాల బేజారుతో ఈ వసూళ్లు ఇంకా చాలా పెరుగుతాయి అని చెబుతున్నారు. అయితే ఇప్పుడు చర్చ దాని గురించి కాదు. ఆ సినిమాల కేమియోల గురించి, అదే పరిస్థితి తెలుగు సినిమాకు ఉంటే ఎదురయ్యే పరిస్థితి గురించి. కావాలంటే మీరే లెక్క చూడండి ‘జైలర్ 2’ సినిమాలో ఎన్ని అతిథి పాత్రలు ఉన్నాయో.
మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి, వినాయకన్, సంతానం (డిలీటెడ్).. ఇలా ఈ సినిమాలో ఇన్ని అతిథి పాత్రలు ఉన్నాయి. ఇందులో వినాయకన్, సంతానం వదిలేస్తే మిగిలిన అందరూ ఆయా సినిమా పరిశ్రమల్లో టాప్ నటులే. ఈ సినిమాకు అవసరమైన హంగులను వారంతా అందించారు. ఇప్పుడు సినిమాకు భారీ వసూళ్లు వస్తున్నాయి. అయితే ఇన్ని పాత్రలో ఓ తెలుగు సినిమాలో ఉంటే.. బ్యాకప్, ప్యాడింగ్ అంటూ కామెంట్లు వచ్చేసేవి.
అలా ఎలా అనుకుంటారు అంటారా? కావాలంటే మీరే గుర్తు చేసుకోండి. ‘గాడ్ ఫాదర్’ సినిమా సమయంలో, ‘వాల్తేరు వీరయ్య’ సినిమా టైమ్లో, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా సీజన్లో ఇలాంటి కొన్ని కామెంట్లు వచ్చాయి. చిరంజీవితోపాటు ఆ సినిమాలో ఇంకో హీరో ఎందుకు.. చిరంజీవి హ్యాండిల్ చేయలేడా అన్నారు. ఇప్పుడు రజనీకాంత్ అన్ని కేమియోలతో వస్తే ఎంజాయ్ చేస్తున్నారు. ఇదన్నమాట టాలీవుడ్ అభిమానుల పరిస్థితి.














