అన్ని రంగాల్లోనూ అమ్మాయిలను లోబరుచుకునేవాళ్ళున్నారు..!

‘స్వయంవరం’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమై ‘మనోహరం’ ‘ప్రేమించు’ వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది మన తెలుగుమ్మాయి లయ. కొత్త హీరోయిన్ల జోరుతో సినిమాలు తగ్గుతున్న సమయంలో లయ పెళ్ళి చేసుకుని ఇండస్ట్రీకి బైబై చెప్పేసి వెళ్ళిపోయింది. ఈ జనరేషన్ లో చక్కటి నటన తెలిసిన తెలుగుమ్మాయి లయ మాత్రమే అనడంలో సందేహం లేదు. ‘ప్రేమించు’ చిత్రంలో అంధురాలిగా నటించి తన టాలెంట్ ఏంటనేది ప్రూవ్ చేసింది లయ. ఇక ఈ మధ్య కాలంలో రవితేజ – శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో మాత్రమే నటించింది. ఇక తాజాగా ‘కాస్టింగ్ కౌచ్’ తన స్పందనని తెలియజేసింది లయ.

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో లయ ‘కాస్టింగ్ కౌచ్’ పై స్పందిస్తూ… “అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ వుండేది, అయితే చిన్నస్థాయిలో జరిగేదని విన్నాను. ఒక్క ఫిలిం ఇండస్ట్రీలోనే కాదు సాఫ్ట్‌వేర్‌, కార్పొరేట్, హాస్పిటల్… ఇలా అన్ని రంగాల్లో అమ్మాయిలను లోబరుచుకోవాలనుకునేవాళ్ళున్నారు.. అయినా గ్లామర్ ఫీల్డ్ కాబట్టి సినిమా ఇండస్ట్రీ గురించి ఎక్కువ మాట్లాడుతారు… కేవలం సినిమా ఇండస్ట్రీని ఎందుకు టార్గెట్ చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు”…. అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది లయ

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus