శింబుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన లేఖా వాషింగ్టన్

“మీటూ” ఉద్యమం చాలామందిలో చైతన్యం రగిలించింది. కోలీవుడ్ లో ఈ ఉద్యమం ఎక్కువగా కనిపిస్తోంది. చిన్మయి తన అనుభవాలను షేర్ చేసుకోవడంతో పాటు.. మీడియా ముందుకు రాలేని కొంతమంది నటీమణుల ఆవేదనలను కూడా బయటపెట్టడంతో ఈ విషయం అక్కడ పెద్దదయింది. తాజాగా లేఖా వాషింగ్టన్ తనతో ఓ నటుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని శింబుపై పరోక్షంగా ఆరోపణలు చేసింది. వేదం, డైనమేట్ వంటి చిత్రాల ద్వారా తెలుగు వారికీ పరిచయమైన ఈ బ్యూటీ తమిళంలోనూ కొన్ని సినిమాలు చేసింది. గతంలో శింబు, లేఖా వాషింగ్టన్ కలిసి కెట్టావన్ అనే చిత్రంలో నటించారు. కానీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు.

“మీటూ” హాష్ ట్యాగ్ జత చేస్తూ ఒక్క మాట : కెట్టావన్” అని లేఖా ట్వీట్ చేసింది. ఈ ఒక్కమాట రచ్చకి తెరలేపింది. తన హీరో పేరుని చెడగొట్టేందుకు వ్యాఖ్యలు చేశారంటూ లేఖపై శింబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు చెప్పకూడని పదాలతో దూషిస్తున్నారు. ఆ కామెంట్లను చదివిన లేఖ… దానిని ఉద్దేశించి “మహిళలు కొన్ని సందర్భాల్లో ఎందుకు బయటకు రారో అర్ధమవుతోంది” అని మరో ట్వీట్ చేసింది. ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంకెంతమంది హీరోయిన్స్ .. ఎవరి పేరుని బయటపెడుతారోనని, వీటిలో ఏది నమ్మాలో తెలియక కోలీవుడ్ చిత్ర ప్రముఖులు తలపట్టుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus