Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) మరో బ్రాండ్ కి అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారు. వివరాల్లోకి వెళితే… అన్విత గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్‌గా నటసింహం, హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ వ్యవహరించబోతున్నట్టు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి అచ్యుతరావు బొప్పన వెల్లడించారు. అలాగే అన్విత గ్రూప్ రూపొందించిన బ్రాండ్ ఫిల్మ్స్‌ను శుక్రవారం నాడు హైదరాబాద్ ఆయన ఆవిష్కరించడం జరిగింది.

Nandamuri Balakrishna

ఈ కార్యక్రమంలో అచ్యుతరావు బొప్పన మీడియాతో మాట్లాడుతూ… “5 దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంతో పాటు విద్య, ఆరోగ్య రంగాల్లో బాలకృష్ణ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. చాలా మందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన మాట తప్పే మనిషి కాదు. అన్విత గ్రూప్ మౌలిక సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంది. అందుకే బాలకృష్ణ దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాలని భావించారు. ఆయన దీనికి అంగీకరించడం మా సంస్థకు గర్వకారణం.

‘బిల్డ్ హ్యాపినెస్’ అనేదే అన్విత గ్రూప్ నినాదం. దాన్నే ప్రజల్లోకి తీసుకెళ్లగల ప్రతినిధిగా బాలకృష్ణ నిలుస్తారు. ఆయన భాగస్వామ్యం సంస్థకు మరింత బలాన్ని అందిస్తుంది.గత 2 దశాబ్దాలుగా దుబాయ్, అబూదాబిలో నివాస, వాణిజ్య, హాస్పిటాలిటీ రంగాల్లో 4 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాన్ని పూర్తి చేసిన అన్విత గ్రూప్.. ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్ నగరంలో లైఫ్‌స్టైల్ కమ్యూనిటీని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోంది.

హైదరాబాదులో మూడు ప్రధాన ప్రాజెక్టులతో మొత్తం 80 లక్షల చదరపు అడుగుల నిర్మాణం కొనసాగుతుంది.కొల్లూరులోని అన్విత ఇవానా ప్రాజెక్ట్‌కు షెడ్యూల్‌కు ముందే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రావడం విశేషం. తొలి దశలో 400 యూనిట్లను వినియోగదారులకు అందించబోతున్నాం. అలాగే అన్విత హై నైన్, మేడ్చల్ ‌లోని అన్విత పార్క్‌సైడ్ ప్రాజెక్టులు నగర జీవనానికి కొత్త నిర్వచనం ఇవ్వనున్నాయి” అంటూ చెప్పుకొచ్చారు.

సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus