Oscar: ఈ ఆస్కార్‌ బరిలో నిలిచిన మన సినిమాలు ఎన్నంటే? ఒకటి అఫీషియల్‌.. మిగిలినవి!

ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డుల వేడుకకు సర్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో పోటీ కోసం ప్రపంచవ్యాప్తంగా సినిమాలు సిద్ధమయ్యాయి. మన దేశం నుండి కూడా సినిమాలు రెడీ అవుతున్నాయి. ఓ సినిమా మన దేశం నుండి అధికారికంగా ఎంట్రీ ఇవ్వగా.. మరికొన్ని సినిమాలు నేరుగా పోటీకి దిగాయి. అలా మొత్తంగా సినిమాలు బరిలో నిలిచాయి. ఆ సినిమాల వివరాలు చూద్దాం.

Oscar

ఇషాన్‌ కట్టర్‌, జాన్వీ కపూర్‌, విశాల్‌ జెత్వా ప్రధాన పాత్రల్లో కరణ్‌ జోహర్‌ నిర్మించిన బాలీవుడ్‌ చిత్రం ‘హోం బౌండ్‌’ ఆస్కార్‌ అవార్డుల బరిలో మన దేశం నుండి అధికారికంగా బరిలో నిలిచింది. ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో టాప్ 15 లిస్ట్‌లో నిలిచింది. ఇది కాకుండా రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1’, యానిమేషన్‌ సినిమా ‘మహావతార్ నరసింహ’ కూడా బరిలో నిలిచాయి. ఈ మేరకు ఆ సినిమాల నిర్మాణ సంస్థ ప్రముఖ చిత్ర హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. ‘కాంతార’ సినిమాకుకు ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్ 1’ తెరకెక్కిన విషయం తెలిసిందే.

‘మహావతార్ నరసింహ’ సినిమా విషయానికొస్తే.. విష్ణుమూర్తి పరమ భక్తుడు ప్రహ్లాదుడి చరిత్ర, శ్రీమహావిష్ణువు నరసింహావతారంలో హిరణ్యకశిపుని సంహారించే ఘట్టాలను ఈ సినిమాలో పొందుపరిచారు. వీటితోపాటు తమిళ హిట్‌ చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’, ‘సిస్టర్ మిడ్ నైట్’, ‘తన్వీ ది గ్రేట్’ సినిమాలు కూడా ఆస్కార్ బరిలో ఉన్నాయి. శ్రీలంకలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒక కుటుంబం తమిళనాడుకు వలస రావడం, వారి జీవితాల్లో జరిగే సంఘటనల చుట్టూ అల్లుకున్న కథ ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’.

‘సిస్టర్‌ మిడ్‌నైట్‌’ విషయానికొస్తే.. రాధికా ఆప్టే కీలక పాత్రలో నటించిన సినిమా ఇది. ‘తన్వీ’లో అనుపమ్‌ ఖేర్‌ స్వీయ దర్శకత్వంలో నటించారు. ఇందులో శుభాగ్ని దత్‌ కీలక పాత్రధారులు. మార్చి 15న 98వ ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. ఇక ఆస్కార్ అవార్డు కోసం పోటీ పడే చిత్రాల ఫైనల్ జాబితాను ఈ నెల 22న విడుదల చేస్తారు. అప్పుడు ఈ విషయంలో మరింత క్లారిటీ వస్తుంది.

 పరిస్థితి మా చేయి దాటిపోయింది.. ‘జన నాయగన్‌’ ప్రొడ్యూసర్‌ ఎమోషనల్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus