Pawan Kalyan: పవన్ పై ప్రశంసల వర్షం కురిపించిన ప్రముఖ నటి.. ఏం చెప్పారంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా కోసం పని చేసినా, ఒక సీన్ కోసం పని చేసినా ఆయనతో పని చేసిన వాళ్లు ఆయన గురించి ఎంతో గొప్పగా చెబుతారు. స్నేహానికి పవన్ కళ్యాణ్ ఎంతో విలువ ఇస్తారని, నిర్మాతల శ్రేయస్సును కోరే హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరని చాలామంది భావిస్తారు. పవన్ సక్సెస్ రేట్ కూడా ఎక్కువనే సంగతి తెలిసిందే. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు కమర్షియల్ గా హిట్లుగా నిలిచాయి.

ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉన్నా నిర్మాతలకు ఈ సినిమాలు మంచి లాభాలను అందించాయి. అయితే వకీల్ సాబ్ మూవీలో నటించి ఆ సినిమా ద్వారా గుర్తింపును సొంతం చేసుకున్న ప్రముఖ నటి లిరీష ఒక ఇంటర్వ్యూలో పవన్ గొప్పదనం గురించి వెల్లడించిన విషయాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దేవుడితో సమానంగా అభిమానులు కొలిచే హీరో పవన్ కళ్యాణ్ మాత్రమేనని లిరీష ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ ను (Pawan Kalyan) నటుడిగా, రాజకీయనేతగా ఎలా డిస్క్రైబ్ చేస్తావనే ప్రశ్నకు స్పందిస్తూ లిరీష ఈ వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్, బాలీవుడ్, ఇతర ఇండస్ట్రీలలో స్టార్ హీరోలకు ఫ్యాన్స్ ఉన్నారని అయితే పవన్ కళ్యాణ్ కు ఉన్న స్థాయిలో డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రం ఎవరికీ లేరని ఆమె కామెంట్లు చేశారు. సీరియస్ గా నేను ఈ విషయాన్ని చెప్పగలనని లిరీష పేర్కొన్నారు.

దేవుడి తర్వాత, దేవుడితో సమానంగా కొలిచేది పవన్ ను మాత్రమేనని లిరీష అన్నారు. ఆ రేంజ్ లో పవన్ కు డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారని లిరీష చెప్పుకొచ్చారు. నాకు పాలిటిక్స్ గురించి ఎక్కువగా అవగాహన లేదు కాబట్టి రాజకీయాల గురించి మాత్రం ఎక్కువగా కామెంట్ చేయలేనని ఆమె కామెంట్లు చేశారు. అందువల్ల పాలిటిక్స్ కు సంబంధించి మాత్రం నేను సైలెంట్ గా ఉంటే బెటర్ అని అనుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus