ఈ వెడ్డింగ్ సీజన్‌లో సెలబ్రిటీలంతా ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు.. తమకిష్టమైన వ్యక్తులతో ఏడడుగులేసి.. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు.. ఇప్పటికే పలువురు నటీనటులు, నిర్మాత, దర్శకులు వివాహ బంధంలోకి ఎంటర్ అయ్యారు.. రీసెంట్‌గా ప్రముఖ నటి, కమెడియన్‌ని పెళ్లాడిన న్యూస్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్‌లో పలు సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో యాక్ట్ చేసిన మాన్వి గాగ్రూ, స్టాండప్ కమెడియన్ వరుణ్ కుమార్‌ని వివాహం చేసుకుంది..
ఫిబ్రవరి 23న తమ మ్యారేజ్ జరిగిందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్స్ షేర్ చేసింది.. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగిందని.. అందరూ తమ జంటను బ్లెస్ చెయ్యాలని కోరింది.. దీంతో సెలబ్స్, నెటిజన్స్ విషెస్ తెలియజేస్తున్నారు.. 2008లో ‘ద చీతా గర్ల్స్: వన్ వరల్డ్’ మూవీతో నటిగా మారిన మాన్వి.. ఆ తర్వాత ‘నో వన్ కిల్డ్ జెస్సికా’, ‘పీకే’, ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’ తదితర చిత్రాల్లో సహాయ పాత్రలు చేసింది..
‘ద గుడ్ వైబ్స్’, ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్’, ‘మేడ్ ఇన్ హెవెన్’, ‘తమష్రీ’ వంటి వెబ్ సిరీస్‌ల్లోనూ నటించింది.. స్టాండప్ కమెడియన్, యాక్టర్, కమ్ రైటర్‌గా గుర్తింపు తెచ్చకున్న వరుణ్ కుమార్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు..
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?