కాల్ గర్ల్ గా హీరోయిన్!

  • June 22, 2016 / 09:58 AM IST

‘నచ్చావులే’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే  మంచి పేరు తెచ్చుకుంది మాధవిలత. ఆ తర్వాత ‘స్నేహితుడా, అరవింద్ 2’ చిత్రాల్లో కనిపిపించింది. అయితే ఈ సినిమాలేవీ ఈ భామకు కలిసి రాలేదనే చెప్పాలి. కొద్దిరోజులుగా ఆమె అసలు సినిమాల్లో కనిపించడమే తగ్గిపోయింది.

అయితే ఇప్పుడో షార్ట్ ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదీ కాల్ గర్ల్ పాత్రలో..  ‘ఆన్ మోనాస్ బర్త్ డే’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ షార్ట్ ఫిల్మ్ స్టోరీ లో కాల్ గర్ల్ గా కనిపించింది మాధవి. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ వదిలారు. ఈ చిత్రానికి నరేంద్ర నాథ్ దర్శకుడు. గతంలో అనుష్క వేదం సినిమాలో ఇలాంటి తరహా పాత్రలోనే కనిపించింది.

ఆ తరువాత మరే హీరోయిన్ ఇలాంటి పాత్రల్లో కనిపించలేదు. కాల్ గర్ల్ క్యారెక్టర్ అంటే ఎవరైనా కాస్త వెనకడుగు వేస్తారు. మరి మాధవి ధైర్యం చూస్తుంటే పాత్రలో విషయం ఉందనే అనుకోవాలి. ఈ షార్ట్ ఫిల్మ్ తో అయినా.. మాధవికి అవకాశాలు వస్తాయేమో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus