‘ఎక్స్‌పైరీ డేట్‌’కి రెస్పాన్స్ బాగుంది: మధు షాలిని ఇంటర్వ్యూ

“ఏడాదికి ఒక్క సినిమా చేసినా చాలు… నాకు కథ, అందులో పాత్ర నచ్చాలి. కథ బావుంటే ఎవరూ నన్ను ఒప్పించాల్సిన అవసరం లేదు. బోల్డ్ రోల్స్ చెయ్యడానికి కూడా రెడీ” అని తెలుగమ్మాయి మధు షాలిని అన్నారు. ‘ఎక్స్‌పైరీ డేట్’ సిరీస్‌తో వెబ్ వరల్డ్‌లోకి ఆమె ఎంటర్ అయ్యారు. స్నేహా ఉల్లాల్, టోనీ లూక్, అలీ రెజా ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 9న ‘జీ 5’లో రిలీజ్ అయ్యింది. హిందీ వెర్షన్ 2న రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా మధు షాలినితో ఇంటర్వ్యూ..

‘ఎక్స్‌పైరీ డేట్‌’కి రెస్పాన్స్ ఎలా వుంది?

ఇది తెలుగు, హిందీ బైలింగ్వల్‌ వెబ్‌ సిరీస్‌. దీనికి సౌతిండియన్‌ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎక్కువ మంది పని చేశారు. అందుకని, హిందీలో మొదట పట్టించుకోలేదు. సిరీస్‌ చూశాక చాలామంది మెసేజ్‌లు చేశారు. కొంతమంది బాలీవుడ్ దర్శకులు ఫోన్‌లు చేసి ‘నెక్ట్స్‌ ఏం చేస్తున్నావు?’ అని అడిగారు. కొన్ని అవకాశాలు వచ్చాయి. త్వరలో ఆడిషన్‌ కూడా ఇవ్వవచ్చు.

ఇందులో మీ పాత్ర ఏమిటి?

నా క్యారెక్టర్ పేరు సుజాత. ఐదో ఎపిసోడ్‌లో ఎంటర్ అవుతుంది. ఏదైనా చేసే ముందు సమాజం ఏమనుకుంటుందోనని ఆలోచించి భయపడే క్యారెక్టర్. ఇప్పటివరకూ ఇటువంటి క్యారెక్టర్ చెయ్యలేదు.

క్యారెక్టర్‌ కోసం ప్రత్యేకంగా ప్రిపేర్‌ అయ్యారా?

నా రియల్ లైఫ్ క్యారెక్టర్ కి డిఫరెంట్ క్యారెక్టర్ ఇది. అందుకని, చాలా వెబ్‌ సిరీస్‌లు చూశా. ఫీమేల్‌ క్యారెక్టర్లు మాత్రమే కాకుండా, మేల్‌ క్యారెక్టర్లనూ రిఫరెన్స్‌గా తీసుకున్నా.

అసలు, కథేంటి?

కథ కొత్తగా ఉంటుంది. నలుగురు విభిన్న వ్యక్తులు ఒక చోటికి ఎలా వచ్చారు? ఏంటి? అనేది కథ. రిలేషన్షిప్స్‌ని కొత్తగా చూపిస్తున్నారని అనిపించింది. సీక్వెల్‌కి కూడా ఛాన్స్‌ ఉంది.

కథ విన్నప్పుడు ఏమని అనిపించింది?

నిజం చెప్పాలంటే… ‘ఎక్స్‌పైరీ డేట్‌’ చిత్రీకరణ ప్రారంభం కావడానికి ముందే శంకర్‌ మార్తాండ్‌గారు నాకు కథ వినిపించారు. అప్పటికి నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ శరత్‌ మరార్‌గారు ప్రాజెక్ట్‌ టేకప్‌ చేయలేదు. వెబ్‌ సిరీస్‌ చేస్తే బావుంటుందని అనిపించింది. మొత్తం ప్రాజెక్ట్‌ సెట్‌ కావడానికి టైమ్‌ పట్టింది. ఫైనల్లీ… శరత్‌గారు టేకప్‌ చేసినప్పుడు శంకర్‌గారు నాకు ఫోన్‌ చేసి చెప్పారు. నాకు చాలా నచ్చిన కథల్లో ఇదొకటి.

లాక్‌డౌన్‌లో ఏం చేశారు?

ఈ సిరీస్ షూటింగ్ చేశా. లాక్‌డౌన్‌ టైమ్‌లో మా లాస్ట్‌ షెడ్యూల్‌ ఉండాలి. ఈలోపు లాక్‌డౌన్‌ అనౌన్స్‌ చేశారు. కొచ్చి‌లో టోనీ లూక్‌, ముంబైలో స్నేహా ఉల్లాల్‌ స్టక్‌ అయ్యారు. మళ్లీ అందరూ కలిసి లాక్‌డౌన్‌ పీరియడ్‌లో జాగ్రత్తలు తీసుకుని సిరీస్‌ చేశాం. కరోనా వల్ల అందరూ భయపడ్డాం. చాలా జాగ్రత్తగా, కషాయాలు తాగుతూ షూటింగ్‌ చేశాం.

మళ్ళీ వెబ్‌ సిరీస్‌ అవకాశం వస్తే నటిస్తారా?

ప్రస్తుతం ‘బాహుబలి’ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా ప్రొడ్యూస్‌ చేస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘రైజ్‌ ఆఫ్‌ శివగామి’లో నటిస్తున్నాను. అది హిందీ సిరీస్‌.

ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు?

తమిళ డైరెక్టర్ బాలా ప్రొడక్షన్ లో ఓ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశా. మరో తమిళ, తెలుగు బైలింగ్వల్ ఫిలిం చేశా. తెలుగులో ‘గూఢచారి 2’ ఉంది.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus