పబ్లిసిటీ కోసం కొంతమంది స్టార్ హీరోల పై ఎన్నో వివాదాస్పద కామెంట్లు చేస్తుంటారు. కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవిస్తున్న హీరోయిన్ కంగనా రనౌత్ ఎందుకు అక్కడి స్టార్ల పై విరుచుకుపడుతుందో అస్సలు అర్ధం కాని ప్రశ్న. ఈ మధ్య కాలంలో ఇలాంటి వివాదాస్పద కామెంట్లు ఎక్కువగా చేస్తుంది. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసుని అడ్డంపెట్టుకుని లేని పోనీ ఆరోపణలు చేస్తుంది. తాజాగా అక్కడి స్టార్లు అంతా డ్రగ్స్ కు బానిసలే అంటూ సంచలన కామెంట్లు చేసింది కంగనా.
ఆమె ఈ విషయం పై స్పందిస్తూ…”బాలీవుడ్ ఒక మురికి కూపం. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళంతా డ్రగ్సుకి బానిసలే. నార్కోటిక్ బోర్డు ధైర్యంగా దర్యాప్తు చేస్తే… బాలీవుడ్ లో చాలా మంది సూపర్ స్టార్లు ఊచలు లెక్క పెడుతారు.నేను నటిగా ఇంకా పాపులర్ కాని టైములో … నా గురువు అని చెప్పుకునే రాక్షసుడు (పరోక్షంగా మహేష్ భట్) నన్ను పార్టీలకు తీసుకెళ్లి డ్రింక్స్ లో మత్తు మందు కలిపి ఇచ్చేవాడు. నేను పోలీసులను ఎక్కడ కలుస్తానో అని చాలా జాగ్రత్త పడేవాడు. నేను కొంచెం ఫేమ్ లోకి వచ్చినప్పుడు బాలీవుడ్ పార్టీ కల్చర్ ఎలా ఉంటుందో అర్థమైపోయింది.
డ్రగ్స్, నీతి లేని మనుషులు, మాఫియా..ఇలా అన్నీ చూశాను.బాలీవుడ్ లో పాపులర్ డ్రగ్ …కొకైన్ అని చాలా మందికి తెలిసే ఉంటుంది. నాకు భద్రత కల్పిస్తాము అంటే.. నార్కోటిక్స్ బోర్డుకి నేను సాయం చేస్తాను. సుశాంత్ కి ఈ సీక్రెట్లు ముందే తెలిసిపోయాయి. అందుకే అన్యాయంగా అతని ప్రాణాలు తీసేసారు” అంటూ చెప్పుకొచ్చింది కంగనా.