Ravi Babu: ఫైర్ బ్రాండ్‌తో రవిబాబు సినిమా చేస్తున్నారా? ఎలా ఓకే చేసిందబ్బా..
- October 28, 2026 / 11:19 AM ISTByFilmy Focus Desk
ఎప్పుడో 17 ఏళ్ల క్రితం ‘ఏక్ నిరంజన్’ సినిమాతో టాలీవుడ్లో కనిపించింది కంగనా రనౌత్. ఆ సినిమా ఫలితం, ఆమెకు వచ్చిన రెస్పాన్స్‌లు కారణమో, ఇంకే కారణమో కానీ.. ఆ తర్వాత ఆమె ఇటువైపు మళ్లీ చూసింది లేదు. అయితే ఇప్పుడు తిరిగి ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది అనే చర్చ జరుగుతోంది. అది కూడా విచిత్ర సినిమాలు తెరకెక్కించే దర్శకుడు రవిబాబుతో. ఈ మాట వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా.. టాలీవుడ్ వర్గాల సమాచారం అయితే ఇదే.
Ravi Babu – Kangana Ranaut
‘రేజర్’ అనే అదో రకం సినిమాతో వచ్చిన రవిబాబు.. ఇప్పుడు హారర్ జానర్‌తో మరోసారి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోనే కంగనా రనౌత్‌ను ప్రధాన పాత్రలో నటింపజేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అయిపోయాయట. సీక్రెట్‌గా షూటింగ్ కూడా జరుగుతోంది అని చెబుతున్నారు. అయితే సెట్స్‌లో కంగన అడుగుపెట్టిందో లేదో తెలియాల్సి ఉంది. సినిమా షూటింగ్ మొత్తం అయిపోయాక విషయం బయటకు చెబుతారట.

ఇక కంగన రనౌత్ చేతిలో వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. ‘క్వీన్ 2’, ‘సర్కిల్’ సినిమాలు చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే, ఒకప్పుడు కంగనకు ఉన్న ఆకర్ణణ ఇప్పుడు బాలీవుడ్లో లేదు. ఆమె సరైన విజయం అందుకుని పదేళ్లు అయిపోయింది. గత కొన్నేళ్లుగా చేసిన ప్రత సినిమా బాక్సాఫీసు దగ్గర దారుణ పరాజయం పాలైంది. ఈ సమయంలో తెలుగులోకి వస్తుండటం గమనార్హం.
మరోవైపు రవిబాబు సినిమాలు మినిమమ్ గ్యారెంటీ ఉండవు. ఆయన తన లోకంలో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఆయన అందరూ ఆశ్చర్యపోయే సినిమాలు చేసి ఉన్నారు. అయితే ఇది జరిగి 15 ఏళ్లు అవుతోంది. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇద్దరికీ కీలకమే. అయితే హారర్/ థ్రిల్లర్ సినిమాలు చేయడంలో రవిబాబు టాలెంట్ చాలా డిఫరెంట్. ఇండస్ట్రీలో రీసెంట్ బెస్ట్ హారర్ ఆయన నుండి వచ్చినదే.











