అడల్ట్ సినిమా రీమేక్ లో మరో అందాల భామ!

మన తెలుగు సినిమా ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే వెండితెరపై మోతాదు మించిన శృంగారానికి. డబుల్ మీనింగ్ డైలాగులకు అలవాటు పడుతున్నారు. కాస్త ఇబ్బందిగా అనిపించినా బయటపడకుండా లోలోపల నవ్వుకొంటుంటారు కొందరు. ఆ ఇబ్బందిని గుర్తించారో లేక తెలుగులో సరైన “అడల్ట్ సినిమా” రాలేదని బాధపడ్డారో తెలియదు కానీ.. శృతి మించిన శృంగార సన్నివేశాలు పుష్కలంగా ఉన్న బాలీవుడ్ చిత్రం “హంటర్”ను తెలుగులో రీమేక్ చేయాలని ఫిక్సయ్యాడు యువ దర్శకుడు నవీన్ మేడారం. టైటిల్ పాత్రలో అవసరాల శ్రీనివాస్ నటించనుండగా.. అతడి ప్రియురాలిగా రెజీనా నటించనుంది.

ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో మరో మూడు క్యారెక్యర్లు ఉన్నాయి. ఒకటి హీరోగారిపై మనసుపడిన అమ్మాయి పాత్ర కాగా.. మరొకటి హీరోతో అక్రమ సంబంధం పెట్టుకొనే ఇల్లాలి పాత్ర. హీరో ప్రియురాలిగా యాంకర్ శ్రీముఖిని సెలక్ట్ చేయగా.. ఆంటీ పాత్ర కోసం మానసను ఎన్నుకొన్నారని వినికిడి. “రొమాన్స్” చిత్రంతో వెండితెరకు పరిచయమైన మానస ఆ తర్వాత ఇంకెక్కడా కనిపించలేదు. చాన్నాళ్ల తర్వాత ఈ చిత్రంతో మళ్ళీ ప్రేక్షకులకు పలకరించనుంది. మరి ఈ చిత్రంలో సెక్సీ ఆంటీ పాత్రలో ఏమేరకు అలరిస్తుందో చూడాలి!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus