నక్సలైట్ గా అందాల భామ!

వరుస అపజయాలతో ఇబ్బంది పడుతున్న నారా రోహిత్ తాజా చిత్రం ‘అప్పట్లో ఒకడుండేవాడు’ పై ఆశలు పెట్టుకున్నారు. హైదరాబాద్ పాతబస్తీ నేపథ్యంలో జరిగే ఈ కథలో రోహిత్ ముస్లిం యువకుడిగా కనిపించనున్నారు. ‘అయ్యారే’ ఫేమ్ సాగర్.కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రోహిత్ సరసన తానియా కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో కీలకమైన నక్సలైట్ గా మానస హిమ వర్షిణి నటిస్తోంది. రొమాన్స్ సినిమాలో ప్రిన్స్ తో కలిసి కనిపించిన ఈ భామ తన పాత్ర గురించి వెల్లడించింది. “నేను అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాలో నక్సల్ పాత్ర పోషిస్తున్నాను. ఈ రోల్ ని నేను ఎంజాయ్ చేసాను. ఎందుకంటే నాకు ఒసేయ్ రాములమ్మలో విజయ శాంతి చేసిన పాత్ర అంటే చాలా ఇష్టం. అందుకే ఈ క్యారక్టర్ ఒప్పుకున్నాను” అని మానస చెప్పింది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. సెప్టెంబరు నెలలో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

మానస డిఫరెంట్ రోల్స్ ఎంచుకుంటూ ముందుకు దూసుకు పోతోంది. కన్నడలో ఆమె నటించిన “మృగశిర” సినిమా భారీ విజయం సాధించడంతో అవకాశాలు వెల్లువెత్తున్నాయి. రీసెంట్ గా హిందీ హంటర్ సినిమాను తెలుగులో రీమేక్ చేసున్నారు. ఈ సినిమాలో క్లాసికల్ డ్యాన్సర్ గా నటించమని ఆఫర్ వచ్చింది. “తెలుగు హంటర్ సినిమాలో నటించమని దర్శకుడు నవీన్ మేడారం అడిగారు. అడల్ట్ కామెడీ అయినా ఈ చిత్రంలో నాకోసం క్లాసికల్ డ్యాన్సర్ పాత్రలో మార్పులు చేస్తామని చెప్పారు. వల్గర్ ఉండదని హామీ ఇచ్చారు” అని మానస కొత్త ప్రాజెక్ట్ గురించి చెప్పారు. అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రెజీనా, యాంకర్ శ్రీముఖి ఫైనల్ అయ్యారు. మూడో హీరోయిన్ గా మానస కనిపించనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus