మేఘా ఆకాష్ ఇన్‌స్టాగ్రామ్‌ ని హ్యాక్ చేశారట..!

యూత్ స్టార్ నితిన్‌ హీరోగా వచ్చిన ‘లై’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమయ్యింది మేఘా ఆకాష్‌. ఇక రెండో చిత్రం ‘చల్ మోహన్ రంగ’ చిత్రం కూడా నితిన్‌ తోనే చేసింది. అయితే ఈ రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో కోలీవుడ్ వైపు మళ్ళింది ఈ బ్యూటీ. రజనీ కాంత్ ‘పేట’ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. అయితే అందులో హీరోయిన్ కానప్పటికీ.. అందరి దృష్టి ఈ అమ్మడి పై పడిందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది.

ఇదిలా ఉండగా.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యమా.. యాక్టివ్‌గా ఉంటుంది మేఘా. అలాంటి మేఘా ప్రస్తుతం అయమయానికి గురయ్యింది. విషయంలోకి వెళితే.. తాజాగా ఈ అమ్మడి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ను హ్యాక్‌ చేసారు. ఏడు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్న ఈ అమ్మడి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ను హ్యాక్‌ చేసి రష్యాకు చెందిన ఒక కాస్మోటిక్‌ హస్పిటల్‌కు చెందిన పోస్టులు పెట్టారు కొందరు. ఇక వీటిలో చాలా వరకు అభ్యంతరకర ఫోటోలు కూడా ఉండటంతో మేఘా అభిమానులు షాక్‌ తిన్నారు. ఇక ఈ విషయం పై వెంటనే స్పందించింది.. మేఘా ఆకాష్ ట్విట్టర్‌ ద్వారా తన ఇన్‌స్టా అకౌంట్‌ హ్యాక్‌ అయ్యిందని అభిమానులకు తెలిపింది. మేఘా ఆకాష్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… ‘ నా ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాక్‌ అయ్యింది. ఆ అకౌంట్‌లో వచ్చే మెసేజ్‌లు పోస్టింగ్‌లను పట్టించుకోకండి’ అంటూ క్లారిటీ ఇచ్చింది మేఘా. ఇలా సెలబ్రిటీల అకౌంట్లు హ్యాక్ అవ్వడం కొత్తేమీ కాదు… గతంలో కూడా చాలా మంది సోషల్ మీడియా అకౌంట్లను ఇలాగే హ్యాక్ చేసారు.అయితే ప్రస్తుతం తన టీం తో అకౌంట్ ని సెక్యూర్ చేయించినట్టు మేఘా ఆకాష్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. దీని కోసం తన టీం చాలా కష్టపడ్డారని తెలిపింది. ఇలా నా అకౌంట్ హ్యాక్ కి గురవ్వడం చాలా ఆందోళనకి గురిచేసిందని… ! ఇప్పుడు ఇలా అకౌంట్  సెక్యూర్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus