Actress Mehreen: ‘రాత్రికి రాత్రే మా జీవితాలు మారిపోతాయి’!

ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సినిమా ఇండస్ట్రీలో నటీనటులు పడే కష్టం మాములుగా ఉండదని చెబుతోంది హీరోయిన్ మెహ్రీన్. అందరూ అనుకుంటున్నట్లుగా నటుడిగా జీవించడం అంత సులువు కాదని.. వారి జీవితాలు ఎలా ఉంటాయి..? ఏయే సందర్భాల్లో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాలను ప్రస్తావిస్తూ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ”మా ఆర్టిస్ట్ ల జీవితాలు చాలా గందరగోళంగా, చిత్రవిచిత్రంగా ఉంటాయి. సినిమాల్లోని పాత్రకు తగిన లుక్స్ కోసం శారీరకంగా కఠినమైన శిక్షణ తీసుకోవాల్సిన పరిస్థితులు, షూటింగ్ షెడ్యూల్స్ కి తగ్గట్లుగా జీవనశైలిలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులు వస్తుంటాయి.

Click Here To Watch NEW Trailer

మా జీవితాల్లో కూడా ఎత్తుపల్లాలు ఉంటాయి. రాత్రికి రాత్రే మా జీవితాలు మారిపోతాయి కూడా. విజయం దక్కిందని సంతోషించే లోపే ఫెయిల్యూర్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎండా, వాన, చలి అనేవి లెక్కచేయకుండా షూటింగ్ లో పాల్గొనాల్సిన పరిస్థితులు కలుగుతుంటాయి. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని తెలుసు. అదే విధంగా సినిమా కోసం కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అన్నీ తెలిసి కూడా ఈ రంగాన్ని ఎన్నుకుంటాం” అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చింది.

హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన మెహ్రీన్ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. మధ్యలో పెళ్లికి రెడీ అయింది. ఎంగేజ్మెంట్ జరిగిన తరువాత పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘ఎఫ్3’ సినిమా కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో వరుణ్ తేజ్, వెంకటేష్ హీరోలుగా నటించారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus