Mirna Menon: మిర్న మీనన్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మెంటలెక్కిపోతారు!

  • August 20, 2023 / 10:35 PM IST

రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సునామి లాంటి వసూళ్లను రాబట్టిన చిత్రం ‘జైలర్’. రజినీకాంత్ హీరో గా నటించిన ఈ చిత్రం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన సంగతి అందరికీ తెలిసిందే. విడుదలకు ముందే అద్భుతమైన బ్లాక్ బస్టర్ పాటలు మరియు ట్రైలర్ తో అభిమానుల్లో ఒక రేంజ్ లో అంచనాలను రేపిన ఈ సినిమా, విడుదల తర్వాత ఆ అంచనాలను అందుకోవడం లో సక్సెస్ అయ్యింది. ఏ రజినీకాంత్ ని అయితే చూసి ఒకప్పుడు అభిమానులు కేరింతలు కొట్టారో, అలాంటి రజినీకాంత్ ని మళ్ళీ వెండితెర పై చూపించారు.

ఇక ఆ తర్వాత జరిగింది మొత్తం చరిత్ర అనే చెప్పాలి. తమిళ నాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్ కూడా కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ ని దక్కించుకొని కేవలం మొదటి వారం లోనే 400 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకున్న సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇకపోతే ఏ చిత్రం లో రజినీకాంత్ తో పాటుగా తోటి నటీనటులు కూడా ఎంతో చక్కగా నటించారు. ముఖ్యంగా రజినీకాంత్ కి కోడలిగా నటించిన మిర్న మీనన్ అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించింది.

అందంతో పాటు అభినయం తో కూడా ఈమె ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా చూసి బయటకి వచ్చిన తర్వాత ఎవరు ఈ అమ్మాయి ఇంత బాగుంది అని, ఆమె గురించి గూగుల్ లో సమాచారం వెతకడం ప్రారంభించారు నెటిజెన్స్. ఆ సమాచారం ప్రకారం ఈమె కేరళ కి చెందిన అమ్మాయి అని,ఈ సినిమాకి ముందే గతం లో ఆమె చాలా సినిమాల్లో నటించిందని తెలిసింది. సినిమాల్లో రాకముందు ఈమె పేరు అదితి మీనన్.

సినిమాల్లోకి వచ్చిన తర్వాత ట్రెండీ గా పేరు ఉండాలని మిర్న మీనన్ గా మార్చుకుంది. తొలిసినిమా తమిళం లో ‘పట్టాదారి’. ఆ తర్వాత ఈమె మలయాళం లో మోహన్ లాల్ హీరో గా నటించిన ‘బిగ్ బ్రదర్’ చిత్రం లో నటించి గుర్తింపు ని దక్కించుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత ఆమె అల్లరి నరేష్ తో కలిసి ‘సిల్లీ ఫెలోస్’, ‘ఉగ్రం’ వంటి చిత్రాల్లో నటించింది. ఇన్ని చిత్రాల్లో నటించినా రాణి క్రేజ్, ఆమెకి కేవలం జైలర్ చిత్రం తో వచ్చింది. ఇక నుండి ఆమె కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus