Mrunal Thakur: ‘సీతా రామం’ బ్యూటీకి ఏమైంది.. క్లారిటీ ఇదే..!

మృణాల్ ఠాకూర్ ‘సీతా రామం’ చిత్రంతో బాగా ఫేమస్ అయ్యింది. ఈ సినిమాలో ప్రిన్సెస్ నూర్జహాన్ అలియాస్ సీత అనే పాత్రలో మంచి నటన కనబరిచింది. అప్పటివరకు ఎప్పుడూ చూసే స్టార్ హీరోయిన్లను చూసి చూసి ఆడియన్స్ కు బోర్ కొట్టేసింది. అయితే ఈమె లుక్స్ అందరినీ కట్టిపడేశాయి. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో పాటల్లో వచ్చే లిరిక్స్ అన్నీ కూడా ఈమెను చూసే రాశారా అనిపిస్తుంటుంది.

ఇక మృణాల్ టాలీవుడ్లో పెద్ద హీరోయిన్ అయిపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అంత స్పీడ్ గా అయితే ఈమె కెరీర్ సాగడం లేదు. ప్రస్తుతం మృణాల్ నాని 30వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే బాలీవుడ్లో మాత్రం ఈమెకు ఎక్కువ ఆఫర్లే వస్తున్నాయి. ‘లస్ట్ స్టోరీస్ 2’, ‘పూజ మేరీ జాన్’, ‘గుమ్రాహ్’ వంటి ప్రాజెక్టుల్లో నటిస్తూ ఈమె బిజీగా గడుపుతోంది. త్వరలోనే అవి రిలీజ్ అవుతాయి. ఇదిలా ఉండగా..

ఇటీవల మృణాల్ (Mrunal Thakur) తన ఇన్ స్టాగ్రామ్లో పెట్టిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. నిజానికి చర్చనీయాంశం అయ్యిందనే చెప్పాలి. అది చూసిన ప్రేక్షకులు మృణాల్ డిప్రెషన్ కు వెళ్ళిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆమె వెంటనే రియాక్ట్ అయ్యి.. “నేను బాగానే ఉన్నాను. మానసికంగా ఎటువంటి సమస్యలు లేవు.

కొన్ని కొన్ని సార్లు మన ఎమోషన్స్ ని, మన ఫీలింగ్స్ ని ఇతరులతో షేర్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. దాని వల్ల మనసులో ఉన్న భారం దిగిపోయి మనసు తేలిక అవుతుంది. అందుకే అలాంటి ఓ పోస్ట్ పెట్టాను. అంతే ”.. అంటూ సమాధానం ఇచ్చింది ఈ బ్యూటీ.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus