కరోనా బాధితులను ఆదుకోవడం కోసం చాలా మంది సెలబ్రిటీలు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. కొందరు హీరోయిన్లు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పేదలకు, కరోనా బాధితులకు సాయం అందిస్తున్నారు. హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా కరోనా రోగులకు సాయం చేయడానికి ఆన్ లైన్ పోర్టల్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీనికోసం ఆమె ఓ టీమ్ ను ఏర్పాటు చేసుకుంది. తన శక్తి కొద్దీ సాయం చేయడం మొదలుపెట్టింది. అయితే ఆమె పోర్టల్ కు సాయం కోసం వచ్చే వాళ్ల సంఖ్య ఎక్కువైందని..
అందరికీ సాయం చేయలేకపోతున్నామని.. తనకు సహకారం అందించాలని కోరుతోంది. తమ పోర్టల్ కు వచ్చే ప్రతి రిక్వెస్ట్ ను వెరిఫై చేస్తున్నామని.. నిజంగా సాయం కావాలనుకునేవాళ్లకు ధన రూపంలో లేదంటే వస్తు రూపంలో.. వాళ్లకు కావాల్సిన సాయం అందిస్తున్నామని చెప్పింది. అయితే మరింతమంది సాయాన్ని ఆశిస్తున్నారని.. కాబట్టి తమ ఛారిటీకు సహాయం చేయమని ఇతరుల్ని అడగాలనుకుంటున్నామని చెప్పుకొచ్చింది. కరోనా రోగుల కంటే కరోనా నుండి కోలుకొని.. ఇతర ఆరోగ్య-ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారే తనను ఎక్కువగా కాంటాక్ట్ అవుతున్నారని వెల్లడించింది నిధి అగర్వాల్.