అతనే నా భర్త అంటున్న నటి నుస్రత్ .. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

టీఎంసీ ఎంపీ అయిన నుస్రత్ జహాన్ నిత్యం ఏదో ఒక వివాదాంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.నుస్రత్ జహాన్ ఓ బెంగాలీ ముస్లిం అన్న సంగతి తెలిసిందే. గత 3 ఏళ్ళ నుండీ నిఖిల్ జైన్ అనే వ్యాపారవేత్తతో సహజీవనం కొనసాగిస్తోంది. 2019 వ సంవత్సరంలో అతన్ని హిందూ సాంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకుంది. దీని పై అప్పట్లో ఎన్నో వివాదాలు తలెత్తాయి. అనంతరం ఆమె లోక్‌సభకి నుదుటిన బొట్టు పెట్టుకుని వెళ్లిడం పై కూడా చాలా విమర్శలకు తావిచ్చినట్టు అయ్యింది.

అయితే కొన్నాళ్లుగా ఆమె తన భర్త నుండీ వేరుగా ఉంటుంది.వీరి వైవాహిక జీవితంలో అభిప్రాయ భేదాలు రావడంతో గత నవంబర్ నుండీ వీళ్ళు వేరుగా ఉంటున్నారు. వీరిద్దరికీ ఓ మగ బిడ్డ కూడా ఉన్నాడు.వీళ్ళిద్దరూ దూరమైన తర్వాత ఈ బిడ్డ బయటకి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ బిడ్డకు తనకు ఎటువంటి సంబంధం లేదని నిఖిల్ చేసిన కామెంట్స్.. పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే సుస్రత్‌ కూడా ఈ విషయం పై వెంటనే నోరు విప్పలేదు.

కానీ తాజాగా ఆ ప్రశ్నలకు ఈమె తెరదించింది. నిఖిల్ కు దూరమైనప్పటి నుండీ నుస్రత్ యష్ దాస్ గుప్తాతో సన్నిహితంగా ఉంటూ వచ్చ్చింది. నుస్రత్‌కు బిడ్డ పుట్టిన విషయాన్ని కూడా యశ్ దాస్ గుప్తానే ప్రకటించాడు. అయితే యష్ దాస్ గుప్తాతో ఇటీవల క్యాండిల్‌ లైట్ డిన్నర్‌లో పాల్గొన్న నుస్రత్ .. తన భర్త, తన బిడ్డకు తండ్రి యష్ దాస్ అని తెలియజేసింది. ఓ కేక్‌ పై ఆ విషయం గురించి రాసి దానిని ఫోటో తీసి తన పిక్‌ని ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus