Pakeezah: పాకీజా భిక్షాటన.. సాయం చేస్తానన్న చేతులు ఏమైపోయాయ్‌!

సినిమాల్లో బాగా నవ్వించినవాళ్లకు నిజ జీవితంలో బాగా కష్టాలు ఉంటాయి అంటారు. ఈ మాట వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా… టాలీవుడ్‌లో ఇలాంటి దాఖలాలు చాలానే ఉన్నాయి. సినిమాల్లో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన ఎంతోమంది కమెడియన్స్‌… ఇప్పుడు పొట్ట చేత పట్టుకుని రోడ్డున పడ్డారు. తాజాగా ఇలాంటి పరిస్థితుల్లోనే ఓ లేడీ కమెడియన్‌ కనిపించింది. ఎందుకు, ఏంటీ అనేది తెలియదు కానీ.. ఆమె పరిస్థితిని చూసి మరీ ఇంత దయనీయంగా మారిపోయింది ఏంటి అనే కామెంట్స్ వస్తున్నాయి.

పాకీజా (Pakeezah) … ఈ తరం సినిమా జనాలకు ఆమె గురించి తెలియదు కానీ.. నిన్నటి తరం సినీగోయర్స్‌కు ఆమె బాగా పరిచయం. డిఫరెంట్‌ మాడ్యులేషన్‌, యాటిట్యూడ్‌తో కామెడీ చేసి చాలా ఏళ్లపాటు నవ్వించారు. అయితే ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందంటే…‘‘నాకు తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, దానం చేయండి, నేను మీ పాకీజాని, మీకు తోచినంత సాయం చేయండి’’ అంటూ భిక్షాటన చేస్తోంది. తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆమె భిక్షాటన చేస్తున్నట్లు ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

వీడియో ప్రకారం చూస్తే… తిరుపతి గుడి మెట్ల వద్ద ఉన్న షాప్‌ల దగ్గరకు వెళ్లి తన పరిస్థితిని చెప్పుకుని… భిక్షాటన చేసింది. తన పరిస్థితి ఇప్పుడేం బాగోలేదని, ఆర్థికంగా బాగా చితికిపోయానని, దానం చేయాలని కోరింది. ఈ మేరకు కొంతమంది దాతలు స్పందించి ఆమెకు తోచిన సాయం చేశారు. భక్తులు కూడా దానం చేసి.. ఆమెతో ఫొటోలు దిగారు. ఈ వీడియో చూసైనా ఇండస్ట్రీ వాళ్లు సాయం చేస్తారని ఇలా చేస్తున్నట్టు పాకీజా చెప్పింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అనేక సినిమాల్లో నటించిన పాకీజా పరిస్థితి బాగోలేదని ఆ మధ్య కొంతమంది సినిమా ప్రముఖులు సాయం చేయడానికి ముందుకొచ్చారు. కొందరు ఇచ్చారు కూడా. అయితే మళ్లీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది తెలియాల్సి ఉంది.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus