Mangalavaaram Teaser: కాంతార స్టైల్ లో మంగళవారం టీజర్.. ఎలా ఉందంటే?

ఈ మధ్య హారర్ జోనర్ సినిమాలకి మళ్లీ డిమాండ్ పెరిగింది. కాంతార, విరూపాక్ష సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయి. విరూపాక్ష లో బ్లాక్ మ్యాజిక్ ను చాలా ఆసక్తికరంగా చూపించాడు దర్శకుడు కార్తీక్ దండు. ఇక కాంతార ఏ రేంజ్ లో అలరించిందో చెప్పనవసరం లేదు. గతేడాది చివర్లో వచ్చిన మాసూద చిత్రం కూడా పెద్ద హిట్ అయ్యింది.ఇప్పుడు ఆర్.ఎక్స్.100 దర్శకుడు అజయ్ భూపతి కూడా అదే పద్ధతి ఫాలో అయినట్టు తెలుస్తోంది.

ఆయన దర్శకత్వంలో రూపొందిన (Mangalavaaram) మంగళవారం టీజర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. టీజర్ లో హార్రర్ ఎలిమెంట్స్ కనిపించాయి. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఓ పక్క బెడ్రూమ్ సీన్స్ లో కనిపిస్తూనే మరో పక్క భయపెట్టింది అని చెప్పాలి. కాంతార, విరూపాక్ష సినిమాలకి నేపథ్య సంగీతం అందించిన అజ్నీష్ లోకనాథ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. టీజర్ కి అది కూడా హైలెట్ అయ్యింది అని చెప్పాలి.

ఈ మూవీ సక్సెస్ అవ్వడం దర్శకుడు అజయ్ భూపతి కి , హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి.మొదటి సినిమాతో పెద్ద స్టార్లు అవుతారు అనుకున్న ఈ ఇద్దరూ ఇప్పుడు రేస్ లో వెనుక పడ్డారు. ఈ సినిమా కనుక ఫ్లాప్ అయితే జనాలు వీరిద్దరినీ మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం వీరికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూడాలి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus