Actress Poorna: పూర్ణ సైలెన్స్ వెనుక కారణమేంటి..!

ఈ మధ్యనే ఈమె పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి అభిమానులను సర్ప్రైజ్ చేసింది పూర్ణ.యూఏఈ కి చెందిన బిజినెస్మెన్ షానిద్‌ అసిఫ్‌ అలీని పెళ్లి చేసుకోబోతున్నట్లు తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అసిఫ్‌ అలీ జేబీఎస్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలకు సీఈఓ, ఫౌండర్‌ అన్న సంగతి తెలిసిందే. జమా అల్ మెహరి అనే సంస్థని కూడా స్థాపించి….కొత్త ఆఫీస్ లు ప్రారంభించడానికి కావలసిన సర్వీసులను ప్రొవైడ్ చేస్తున్నాడు. అంతేకాకుండా సెలబ్రిటీలకు యూఏఈ వీసాలను కూడా ఏర్పాటు చేస్తుంటాడు.

వీసా ప్రాసెసింగ్‌ అలాగే ఫ్లైట్‌ టికెటింగ్‌ వంటి పలు సర్వీసులను కూడా షానిద్‌ కంపెనీ ఏర్పాటు చేస్తూ ఉంటుంది. కాజల్‌, ప్రియమణి, ప్రణిత, ఆండ్రియా, లక్ష్మీ, విజయ్‌ సేతుపతి, స్వేతా మీనన్‌, నాజర్‌, అజారుద్దీన్‌ వంటి స్టార్లకు యూఎఈ వీసాలను ఏర్పాటు చేశారు. యూఏఈ ముస్లిం మత పెద్దలతో కూడా ఈయనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి.పూర్ణ కుటుంబంతో ముందు నుండి ఇతనికి పరిచయం ఉండడంతో పూర్ణతో ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. అది కాస్త ప్రేమగా ఏర్పడింది.

ఈ మధ్యనే వీరి ఎంగేజ్మెంట్ కేరళలో ఘనంగా జరిగినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు పూర్ణ పెళ్లి ఆగిపోయిందంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు పూర్ణ ఓ టాలీవుడ్ దర్శకుడితో ప్రేమలో ఉండడమే కారణం అంటూ కథనాలు వినిపిస్తున్నాయి. ఆ దర్శకుడికి పెద్దగా సినిమా ఛాన్స్ లు లేవు. కానీ ఏదైనా సినిమా తీస్తే మాత్రం అందులో పూర్ణ ఉండేలా చూసుకుంటాడు.

అతని వల్లే పూర్ణ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందంటూ ప్రచారం మొదలైంది. అయితే పూర్ణ మాత్రం ఈ విషయంపై ఇంకా స్పందించలేదు.దీంతో ఈ ప్రచారం నిజమే అనుకోవాలా లేక, ఇలాంటి రూమర్స్ ను పట్టించుకోవడం ఎందుకని రైట్ టైంలో సరైన విధంగా క్లారిటీ ఇవ్వాలని చూస్తుందా అనేది సస్పెన్స్ గా మారింది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus