గతేడాది జూన్లో దుబాయ్ బేస్డ్ బిజినెస్మెన్ షానిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది పూర్ణ. వీరి వివాహం కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. పూర్ణది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే.షానిద్ ఆసిఫ్ అలీకి టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది తెలుసు. వారందరికీ వీసాల కోసం ఇతన్నే సంప్రదిస్తూ ఉంటారు. అలాగే అరబ్ దేశాల్లో ఉన్న ముస్లిం పెద్దలందరితో కూడా ఇతనికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి.
ఇక పూర్ణ (Poorna) అటు తర్వాత గర్భవతి అయిన సంగతి తెలిసిందే. తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూనే వచ్చింది. అలాగే సీమంతం ఫోటోలను కూడా షేర్ చేసుకుంది. ఏప్రిల్ 4న పూర్ణకి డెలివరీ అయిన సంగతి తెలిసిందే. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.డెలివరీ తర్వాత తన బాబుని పూర్ణ ఎత్తుకుని కుటుంబ సభ్యుల మధ్య అదీ హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోని షేర్ చేసి..
తనకు డెలివరీ చేసిన డాక్టర్ ఫాతిమా సఫ అండ్ ఆస్టర్ హాస్పిటల్ టీంకి స్పెషల్ థాంక్స్ చెప్పింది. ఇక పూర్ణ తన బిడ్డ మొహాన్ని మాత్రం చూపించలేదు. అయితే తాజాగా ‘అవర్ ప్రిన్స్’ అంటూ తన కొడుకు, తన భర్తతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసింది పూర్ణ. ఈ ఫొటోలో తొలిసారి తన కొడుకు మొహాన్ని చూపించింది. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. పూర్ణ కొడుకు ఫోటో చూసిన నెటిజన్లు.. ‘అచ్చం పూర్ణలానే ఉన్నాడు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!
భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!