మామిళ్ళ శైలజ ప్రియా ఇలా చెబితే ఎవ్వరికీ అర్ధం కాదనుకుంట…! అదే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియా, ‘బిగ్ బాస్5’ ప్రియా అంటే టక్కున అందరికీ గుర్తొస్తుంది. సినిమాల్లో తల్లీ,అత్త, పిన్ని వంటి పాత్రలతో అలరిస్తూ వచ్చిన ప్రియా.. సోషల్ మీడియాలో కూడా బాగా ఫేమస్. ఈమె గ్లామర్ కు ఇప్పటి కుర్రకారులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు. అలా సంపాదించుకున్న క్రేజ్ తోనే ఈమె ‘బిగ్ బాస్’ ఛాన్స్ దక్కించుకుంది. హౌస్ లో ఈమె 6 వారాల పాటు కొనసాగింది.
అయితే ‘బిగ్ బాస్5’ తర్వాత ప్రియాకి క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. ఈమె తన సోషల్ మీడియా ఖాతాలో ఏం పోస్ట్ చేసినా వైరల్ అవుతున్నాయి. తాజాగా నైటీలో దర్శనమిచ్చి అందరికీ షాకిచ్చింది ప్రియా. దీనికి సంబంధించిన వీడియోతో పాటు ప్రియాకి సంబంధించి మరికొన్ని ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :